https://oktelugu.com/

Prashanth Neel: ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోలందరూ పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలను చేయడంలో కొంతవరకు వెనుకబడి పోతున్నాడు. అందువల్ల ఆయన మార్కెట్ అనేది భారీగా పడిపోతున్న క్రమంలో ఇప్పుడు ఆయన ప్రశాంత్ నీల్ తో చేయబోయే డ్రాగన్ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 6, 2024 / 01:52 PM IST

    NTR And Prashanth Neel

    Follow us on

    Prashanth Neel: కేజిఎఫ్ సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన దర్శకుడు ప్రశాంత్ నీల్… ఇక ప్రభాస్ తో చేసిన సలార్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన ప్రభంజనాన్ని క్రియేట్ చేసి తనను మించిన దర్శకుడు ఇండస్ట్రీలో మరెవరు లేరు అనెంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రశాంత్ నీల్ మాస్ సినిమాలు చేయడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ ని క్రియేట్ చేయడంలో కూడా చాలా సిద్ధహస్తుడు.ఇక ఆయన సినిమాలన్నింటిలో సలార్ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రభాస్ అభిమానులకు అయితే ఇది విజువల్ ఫీస్ట్ గా కనిపించడమే కాకుండా ప్రభాస్ ని ఒక హై రేంజ్ మాస్ ఓరియెంటెడ్ సినిమాలో చూపించి ప్రశాంత్ నీల్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడనే చెప్పాలి… ఇక ఏది ఏమైనాప్పటికీ ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను ప్రభంజనాలను సృష్టిస్తాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది.

    వీళ్ళ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్క అభిమాని కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు సైతం సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దాదాపు 800 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    ఎన్టీఆర్ మార్కెట్ తో పోలిస్తే ఇది చాలావరకు ఎక్కువనే చెప్పాలి. అయినప్పటికీ ప్రశాంత్ నీల్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది. కాబట్టి ఆయన ఈ మార్కెట్ ని ఈజీగా రీచ్ అవుతాడు. కాబట్టి పెట్టిన బడ్జెట్ తో పాటు ప్రాఫిట్స్ కూడా వస్తాయనే ఉద్దేశ్యంతోనే సినిమా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా మీద భారీ బడ్జెట్ ని పెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ నీల్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి ఒక భారీ సక్సెస్ ని సాధించి పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా దాదాపు 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి… చూడాలి మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది…