Sirivennela Sitaramasastri National Award: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ట్ డైరెక్టర్లు ఉన్నప్పటికి అందులో కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే లభించింది. ముఖ్యంగా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప ఘనతను సాధించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే దర్శకులలో రాజమౌళి ఎంత గొప్ప క్రేజ్ సంపాదించుకున్నాడో లిరిక్ రైటర్ గా సీతారామ శాస్త్రి చాలా గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఒకప్పుడు శ్రీశ్రీ తన కవితలతో, కవిత్వాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేశాడు. ఆయన తరువాత వేటూరి సుందర రామ్మూర్తి చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమాలకు లిరిక్ రైటర్ గా వ్యవహరించి తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. ఇక వీళ్లిద్దరి తర్వాత సీతారామశాస్త్రి తరం స్టార్ట్ అయింది. ఎన్నో గొప్ప పాటలు రాసిన సీతారామశాస్త్రి కి ఎన్నో గొప్ప అవార్డులు కూడా వరించాయి. కానీ ఆయనకు నేషనల్ అవార్డు మాత్రం రాలేదు. కారణం ఏదైనా కూడా ఆయన కొన్ని సినిమాల్లో రాసిన పాటలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఆయనకు నేషనల్ అవార్డు వస్తుంది అని అనుకున్న ప్రతిసారి అతనికి నిరాశే మిగిలింది. మరి ఇలాంటి సందర్భంలో సీతారామశాస్త్రి గురించి ఎంత ఎక్కువ మాట్లాడకున్న తక్కువే అవుతోంది. ఆయన నుంచి వచ్చిన పదాలు చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచి వాళ్ళందరూ వాళ్ళ రంగం లో ఉన్నత స్థాయిని సాధించడానికి వాళ్లలో స్ఫూర్తినింపాయి…
Also Read: మహేష్ బాబు ను ఫాలో అయి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు ఎవరో తెలుసా..?
కానీ ఆయన ఎంటైర్ కెరియర్ లో ఆయనకి ఒక్కటి కూడా నేషనల్ అవార్డ్ రాకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఒకరకంగా నేషనల్ అవార్డు లను సైతం కొంతమంది కావాలని టాలెంట్ ఉన్నవాళ్ళకి ఇవ్వకుండా వాళ్లకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు అంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని రకాల ఆరోపణలైతే ఎదురవుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా సీతారామశాస్త్రి రాసిన పాటలన్నీ అద్భుతాలుగా నిలిచాయి. గొప్ప పదాలను తెలుగు సినిమా సాహిత్యానికి పొందుపరిచి రాసిన గొప్ప రచయితకు నేషనల్ అవార్డు ఇచ్చుకోలేదంటే నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి…
అయినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా అవార్డుల కోసం పాటలు రాయలేదు సిచువేషన్ కి తగ్గట్టుగా పాటలు రాస్తూ అందులో ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడే విధంగా తన పదాల చేత ప్రేక్షకులను అబ్బురపరుస్తూనే, వాళ్లను ఆలోచింపజేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన రాసిన చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా కూడా ఆయన రాసిన పాటల రూపంలో ఆయన ఎప్పటికీ మన మధ్యనే ఉంటాడు.