Polimera 2- Leo: పొలిమేర 2, లియో మూవీ లు జనాలకి నచ్చకపోవడానికి కారణం ఏంటంటే..?

ఆ స్టోరీ కూడా చాలా బాగా రావడం చివర లో ట్విస్ట్ కూడా అదిరిపోయేలా ఉండటం తో ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ స్టోరీ లో నుంచే పుట్టిన కథగానే సెకండ్ పార్ట్ కి లీడ్ దొరికింది.

Written By: Gopi, Updated On : November 5, 2023 4:04 pm

Polimera 2- Leo

Follow us on

Polimera 2- Leo: ఒకప్పుడు సినిమాలు అంటే ఒక మంచి స్టోరీ ని సినిమాగా తీసి అందులోనే కథ అనేది ఫుల్ గా చెప్పి దర్శకుడు ఆ సినిమాని సక్సెస్ చేసుకునేవాడు. కానీ మారుతున్న రోజులకు అనుగుణంగా ఇప్పుడు ఒక పెద్ద కథను చెప్పడానికి రెండు మూడు పార్ట్స్ గా సినిమాలను చేస్తున్నారు. అలా రెండు మూడు పార్ట్స్ గా సినిమా చేయడంలో తప్పులేదు కానీ అలా రెండు మూడు పార్ట్స్ చేసే టైం లో చివరి పార్ట్ లో ఒక పెద్ద కథ చెప్పడానికి మొదటి పార్టులను తీయడంలో డైరెక్టర్లు అంత పెద్దగా సక్సెస్ కావడం లేదు. నిజానికి రీసెంట్ గా వచ్చిన పొలిమేర 2 సినిమాను తీసుకుంటే పొలిమేర పార్ట్ వన్ అద్భుతంగా ఉంటుంది.

ఆ స్టోరీ కూడా చాలా బాగా రావడం చివర లో ట్విస్ట్ కూడా అదిరిపోయేలా ఉండటం తో ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ స్టోరీ లో నుంచే పుట్టిన కథగానే సెకండ్ పార్ట్ కి లీడ్ దొరికింది. అది చాలా బాగుంది కానీ పార్ట్-2 సినిమాలో పార్ట్ 3 కి సంబంధించిన ఒక స్టోరీని కావాలని ఇరికించి పెట్టినట్టుగా అనిపించింది. అలా అనిపించినప్పుడు మొత్తం స్టోరీని పార్ట్ 2 లోనే చెప్పొచ్చు కదా అనేది సగటు అభిమాని కోరుకుంటున్నాడు. నిజానికి పొలిమేర 2 మూవీ రన్ టైం రెండు గంటలే ఉంది.ఇక ఇలాంటి సందర్భంలో మూడో పార్ట్ తీసే కంటే రెండో పార్ట్ లోనే మొత్తం కథ చెప్తే బావుంటుంది కదా అప్పుడు సినిమా మూడు గంటలు అయ్యేది.

దానికి మళ్లీ మూడో పార్ట్ తీయడం ఎందుకు అలా మూడో పార్ట్ తీయాలనే కోరిక ఉన్నప్పుడు రెండో పార్ట్ మీద స్టోరీలో బలం అనేది తగ్గిపోతుంది. నిజానికి సినిమా కూడా ఒక వంతుకు బాగానే ఉన్నప్పటికీ క్లైమాక్స్ లో మాత్రం ప్రేక్షకుడు సాటిస్ఫై అవ్వలేదనే చెప్పాలి. మొదటి పార్ట్ చివరలో రెండో పార్ట్ కు సంబంధించిన ట్విస్ట్ అద్భుతంగా కుదిరింది కానీ, రెండో పార్ట్ ఎండింగ్ లో మూడో పార్ట్ కి సంబంధించిన లీడ్ అంతలా కుదరలేదు దాని వల్ల రెండో పార్ట్ యావరేజ్ సినిమా గానే మిగిలిపోయింది. అలా కాకుండా రెండు గంటల డ్యూరేషన్ ఉన్న ఈ సినిమాని మూడో పార్ట్ చేయకుండా మూడో పార్ట్ ని కూడా ఇందులోనే ఆడ్ చేసి ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు…

ఇక ఈ సినిమాలాగే అయిన మరో సినిమా లియో… లోకేష్ యూనివర్స్ అని పెట్టుకొని ఖైదీ సినిమా చేశాడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాని తర్వాత విక్రమ్ అనే సినిమా చేశాడు సూపర్ డూపర్ హిట్ అయింది. రీసెంట్ గా విజయ్ తో చేసిన లియో సినిమా లో స్టొరీ పెద్దగా ఏమీ లేదు కానీ దాన్ని లోకేష్ యూనివర్స్ లో పార్ట్ గా చేయాలి కాబట్టి ఆయన ఆ సినిమాని అలా తీసినట్టు గా తెలుస్తుంది. యూనివర్స్ అర్థం ఎంటి అంటే ఇండి విజ్యూల్ గా చేసిన సినిమాల్లోని క్యారెక్టర్లు అన్నింటినీ పార్ట్ లో ఈ అన్ని క్యారెక్టర్లకి సంబంధించిన హీరోలు ఆ సినిమాలో కలవడం జరుగుతుంది. వాళ్లు కలిసి ఒక పెద్ద ప్రాబ్లం మీద పోరాడి దానికి సొల్యూషన్ తీసుకురావడమే యూనివర్స్ కి సంబంధించిన సినిమాలను తెరకెక్కించే విధానం…

అయితే ఈ అందరు హీరోలు ఒకచోట కలిసి పోరాటం చేయాలంటే ముందు వీళ్ళు విడివిడిగా ఉన్న సినిమాల్లో హీరో చేసిన ఆ క్యారెక్టర్ ఇండివిజువల్ గా మనకు నచ్చాలి. అలా నచ్చినప్పుడే ఆ క్యారెక్టర్ అందరి హీరోలతో కలిసి ఫైట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అలా చేయాలి అంటే ఈ ముందు తీసే సినిమాల్లో క్యారెక్టర్ డెప్త్ ని చూపించాలి. అలా కాకుండా ఏదో లైట్ వెయిట్ స్టోరీ తో సినిమా చేసి దీన్ని లోకేష్ యూనివర్సిటీకి కన్వర్ట్ చేసి మళ్లీ ఈ హీరో ఆ హీరోలతో కలవబోతున్నాడు అని చెప్తే ఇప్పుడు చూసే సినిమాల మీద కూడా ఆడియెన్స్ కి ఇంట్రెస్ట్ పోతుంది.

ఏ సినిమా తీసిన పర్లేదు కానీ తీసిన సినిమాని క్లారిటీగా ఒక్క పార్ట్ లోనే సినిమా స్టోరీ మొత్తాన్ని చెప్పే విధంగా చేయాలి లేదా రెండు పార్ట్ ల్లో చెప్పాలి అనుకుంటే మొదట తీసిన సినిమా క్లైమాక్స్ లో దానికి ఒక కన్ క్లుజన్ ఇవ్వాలి అలా ఇవ్వలేనప్పుడు ఇలాంటి సినిమాలు తీయకూడదు…ఇప్పుడు పొలిమేర 2 లియో చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా మీరు తీసే సినిమాలు బాగా తీయండి అంతే కానీ పార్ట్ ల మీద ఫోకస్ పెట్టీ ప్రస్తుతం చేస్తున్న సినిమాని చంపేయాకండి అని సగటు సినిమా అభిమాని కోరుకుంటున్నాడు…