Skanda Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు సరికొత్త సినిమాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఇండస్ట్రీలో మాస్ సినిమా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వారిలో బోయపాటి శ్రీను ఒకరు… ఈయన ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా మాస్ సినిమానే కావడం విశేషం….ప్రస్తుతం ఆయన వరుస విజయాలు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమం లో ప్రస్తుతం ఆయన ఇప్పటికీ కూడా మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన హీరో రామ్ తో స్కంద సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఆయన బాలయ్య బాబుతో మరో సినిమా చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది…
అయితే రీసెంట్ గా స్కంద సినిమా ఓటిటి లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లో రామ్ ఒక షాట్ లో రౌడీలా గుండెల్లో రెండు రాడ్లని గుచ్చి తీసే ఒక షార్ట్ ఉంది. దాంట్లో రామ్ అద్భుతంగా చేసి మెప్పించాడు అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది అది ఏంటి అంటే ఆ.షాట్ లో రామ్ కి డూప్ గా బోయపాటి శ్రీను నటించడం అవును మీరు విన్నది నిజమే ఆ ఫైట్ లోని ఒక షాట్ లో రామ్ ప్లేస్ లో బోయపాటి చేసినట్లు గా తెలుస్తుంది. అయితే థియేటర్ లో సినిమా ఫాస్ట్ ఫాస్ట్ గా రన్ అవుతుంది. కాబట్టి మళ్ళీ దాన్ని మనం ప్రీవియస్ చేసి చూడలేం కాబట్టి నడిచిపోతూ ఉంటుంది. కానీ ఓటిటిలో రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఆ సినిమాను స్లో మోషన్ లో చూస్తూ సినిమాలో ఏముంది అనే విధంగా అబ్జర్వేషన్ కూడా చేస్తూ ఉంటారు.
అలా స్కంద సినిమాని కూడా చూసిన కొంతమందికి సినిమాలో రామ్ ప్లేస్ లో బోయపాటి ఒక షాట్ లో నటించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే బోయపాటి రామ్ కి డూప్ గా ఎందుకు చేశాడు.అప్పుడు రామ్ అవలేబుల్ లో లేడా లేదంటే బోయపాటి కావాలనే అలా చేశాడా అనే దాని మీదనే ప్రస్తుతం విపరీతమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి రామ్,బోయపాటి ఇద్దరి బాడీ లాంగ్వేజ్ ఒకేలా ఉన్నప్పటికీ ఇద్దరి బాడీలు పోల్చుకుంటే బోయపాటి కొంచెం వీక్ గా ఉంటాడు.బోయపాటి తో పోల్చుకుంటే రామ్ బాడీ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది. అయినప్పటికీ బోయపాటి రామ్ కి డూప్ గా నటించాలి అని ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ప్రస్తుతం ఆ వీడియో మాత్రం నెట్ లో హల్చల్ చేస్తుంది. ఇక ఆ వీడియో మీద మీరు కూడా ఒక లుక్కేయండి…
Dhorikesaru Sir pic.twitter.com/0AmQvReAev https://t.co/H0rpGVDPsq
— Perfect Wala (@Perfectwala17) November 3, 2023