SV Krishna Reddy: చిరంజీవి ఎస్వీ కృష్ణారెడ్డి ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే..?

SV Krishna Reddy ఎస్వీ కృష్ణారెడ్డి చిన్న హీరోలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. కానీ పెద్ద హీరోలు అయిన నాగార్జునతో చేసిన వజ్రం సినిమా ప్లాప్ అయింది. ఇక చిరంజీవితో కూడా ఒక సినిమా చేయాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు.

Written By: Gopi, Updated On : February 8, 2024 8:01 am

SV Krishna Reddy

Follow us on

SV Krishna Reddy: ఒకప్పుడు కంటెంట్ ఉన్న స్టోరీలతో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్న దర్శకులలో ఎస్ వి కృష్ణారెడ్డి ఒకరు. ఈయన హీరోలతో సంబంధం లేదు కంటెంట్ ను నమ్ముకొని ముందుకెళ్తూ, సినిమాలను చేస్తూ సక్సెస్ లు సాధిస్తూ వచ్చారు. అలాగే ఆయన డైరెక్షన్ చేసే సినిమాకు ఆయనే కథ ,మాటలు , స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా మ్యూజిక్ ని కూడా ఆయనే సమకూర్చేవారు. అందుకే ఆయన సినిమాల్లోని పాటలు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి.ఆ పాటలు ఇప్పుడు విన్నా కూడా మనకు విపరీతంగా నచ్చుతాయి.

అయితే ఎస్వీ కృష్ణారెడ్డి చిన్న హీరోలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. కానీ పెద్ద హీరోలు అయిన నాగార్జునతో చేసిన వజ్రం సినిమా ప్లాప్ అయింది. ఇక చిరంజీవితో కూడా ఒక సినిమా చేయాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ముందుగా చిరంజీవి ఎస్వీ కృష్ణారెడ్డికి ఒక కథ రెడీ చేయమని చెప్పాడు. దాంతో ఈయన కూడా ఒక మంచి కథ రెడీ చేసుకొని చిరంజీవికి వినిపించాడు. అయితే ఆ కథ బాగున్నప్పటికీ చిరంజీవి స్టార్ డమ్ కి సరిపోయే రేంజ్ లో లేకపోవడంతో ఇంకో కథ రెడీ చేయమని చిరంజీవి చెప్పగా, ఎస్ వి కృష్ణారెడ్డి చిరంజీవి సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.

ఎందుకంటే ఆయన సినిమాలు కంటెంట్ బేస్డ్ గా ఉంటాయి. కాబట్టి స్టార్లకి కంటెంట్ తో సంబంధం లేదు వాళ్ళకి అన్ని భారీగా ఉండాలనే ఒక నిజాన్ని తెలుసుకొని స్టార్ల కంటే చిన్న హీరోలతోనే సినిమాలు చేయడం బెస్ట్ అని చిన్న సినిమాలు చేసుకుంటూ వరుసగా మంచి విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఒక టేస్ట్ ఉన్న దర్శకుడిగా మంచి గుర్తింపును పొందాడు. ఈయన సినిమాలోని కామెడీ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. ఎక్కడా కూడా వల్గారిటీ లేకుండా , డబల్ మీనింగ్ డైలాగ్ లేకుండా, చాలా జెన్యూన్ గా కథ తో పాటు నడిచే కామెడీని సృష్టించడంలో ఈయన కింగ్ అనే చెప్పాలి…