https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి ఆ డైరెక్టర్ ని పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే..?

సినిమా హిట్ అయిన ఫట్ అయిన కూడా ఆ డైరెక్టర్ కి ఇచ్చే రెస్పెక్ట్ ని మాత్రం ఎప్పుడూ కూడా చిరంజీవి తగ్గించలేదు. డైరెక్టర్లను సినిమా కి హెడ్ గా భావిస్తూ ఉంటాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 9, 2024 / 02:33 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: చిరంజీవి లాంటి స్టార్ హీరో ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకోవడమే కాకుండా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ మొత్తానికి తనే ఒక స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో చాలా మంది డైరెక్టర్లతో వర్క్ చేశాడు. ఆయనప్పటికీ ఇప్పటి వరకు ఎవరిని కూడా తను ఒక్క మాట కూడా అనలేదు.

    సినిమా హిట్ అయిన ఫట్ అయిన కూడా ఆ డైరెక్టర్ కి ఇచ్చే రెస్పెక్ట్ ని మాత్రం ఎప్పుడూ కూడా చిరంజీవి తగ్గించలేదు. డైరెక్టర్లను సినిమా కి హెడ్ గా భావిస్తూ ఉంటాడు. మరి అలాంటి చిరంజీవి ఒక డైరెక్టర్ విషయంలో అసలు పట్టించుకోవడం లేదనే విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరలవుతుంది. ఆయన ఎవరు అంటే ఛలో సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న వెంకీ కుడుములతో చిరంజీవి సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు. కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయింది. ఇక ఇప్పుడు ఆ దర్శకుడు నితిన్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. అయితే వెంకీ కుడుముల మీద చిరంజీవి కి పూర్తి కాన్ఫిడెన్స్ లేకపోవడంతో అతన్ని పక్కన పెట్టి వశిష్ఠ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అనే టాక్ అయితే వినిపిస్తుంది.

    అయితే తనతో సినిమా చేస్తానని చెప్పి చిరంజీవి తనని 6 నెలల పాటు తన చుట్టూ తిప్పుకొని చివర్లో హ్యాండ్ ఇచ్చాడు అంటూ వెంకీ కుడుముల అభిమానులు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లను వైరల్ చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలో ఈ విషయం మీద చిరంజీవి గానీ, వెంకీ కుడుముల గాని స్పందించడం లేదు. అయితే మరి కొందరు మాత్రం చిరంజీవికి వెంకీ కుడుముల చెప్పిన కథ నచ్చకపోవడం వల్లే ఆయన్ని పక్కన పెట్టారని, వశిష్ట చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

    ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే విశ్వంభర సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను నిలబెట్టుకోవడానికి చిరంజీవి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే దర్శకుడు వశిష్ఠ కూడా ఈ సినిమాని పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2025 లో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది…