Chiranjeevi: సినిమాల పరంగా మెగాస్టార్ చిరంజీవి లైఫ్ గురించి అందరికీ తెలుసు, కానీ ఆయన వ్యక్తిగత లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు. చిరంజీవి చాలా సున్నిత మనసు కలవాడనే విషయం కూడా ఎవరికీ తెలియదు.ఆయన ఎవరిని బాధ పెట్టడు, ఎవరైనా తనని బాధపెడితే మాత్రం ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు అని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి అప్పట్లో నవల రచయత అయిన యండమూరి వీరేంద్రనాథ్ గారి స్టోరీలను తీసుకొని వాటిని సినిమాలు గా చేసి మంచి విజయాలను అందుకున్నాడు.
అందులో ముఖ్యంగా ఛాలెంజ్, అభిలాష లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక అందులో భాగంగానే యండమూరి గారితో చాలా సంవత్సరాల పాటు చిరంజీవికి మంచి రిలేషన్ ఉంది. వీళ్లిద్దరు చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే రామ్ చరణ్ మీద యండమూరి చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల వీళ్ళ మధ్య కొంచెం డిస్టెన్స్ అయితే పెరిగింది.
ఇక రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో యండమూరి వీరేంద్రనాథ్ అలాగే చిరంజీవి ఇద్దరు కలిసి ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి యండమూరి వీరేంద్రనాథ్ గురించి మాట్లాడుతూ ‘ఆయన తనకి సన్నిహితుడని ఆయన రాసిన చాలా నవలలు సినిమాలుగా చేశాను అని చెప్తూనే, తన ఆటో బయోగ్రఫీని కూడా యండమూరి గారు అయితేనే బాగా రాయగలరు అని చెబుతూ, దానిని రాసే బాధ్యతను ఆయనకు అప్పగిస్తున్నాను’ అని చెప్పాడు. ఇక ఇది చూసిన చాలామంది జనం ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే యండమూరి కి చిరంజీవి కి మధ్య మాటలైతే లేవు, మరి ఇప్పుడు చిరంజీవి అంత పెద్ద బాధ్యతని ఆయనకు అప్పగించడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు.
నిజానికి చిరంజీవి ఎవరితో శత్రుత్వం పెట్టుకోడు ఆయనని ఎవరైనా తిట్టిన, ఆయన గురించి బ్యాడ్ గా ప్రచారం చేసిన కూడా మళ్లీ వాళ్లతో మాట్లాడుతాడు, వాళ్లకి ఏదైనా ఆపద వచ్చిందంటే తన వంతు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. ఇక అందులో భాగంగానే యండమూరి గారితో కూడా చాలా సన్నిహితంగా ఉన్న రోజులను గుర్తు చేసుకొని మధ్యలో ఏవో చిన్న పొరపాట్లు ఎవరికైనా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని పట్టించుకోకూడదు అనే ఉద్దేశ్యం తోనే చిరంజీవి యండమూరితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇంకొక విషయం ఏంటి అంటే యండమూరి రామ్ చరణ్ కి యాక్టింగ్ రాదు అంటూ కామెంట్స్ చేశాడు, అయినప్పటికీ రామ్ చరణ్ తనని తాను యాక్టింగ్ లో ఇంప్రూవ్ చేసుకొని ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. కాబట్టి ఆయన చేసిన వాఖ్యల్లో నిజం లేదు. అందువల్లే యండమూరి తో మాట్లాడడం తప్పేం కాదు అని చిరంజీవి కూడా తనతో మాట్లాడుతున్నాడు.