Pawan Kalyan And Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో నటులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ అందులో ఉన్నత స్థానం లో ఉన్న వారు కొందరు మాత్రమే ఉంటారు. అందులో చిరంజీవి మొదటి స్థానం లో ఉంటాడు. అయితే ఇండస్ట్రీ లో కొంతమంది చిరంజీవితో ఫ్రెండ్షిప్ చేస్తూనే చిరంజీవి పైన విమర్శలు చేస్తూ ఉంటారు.
అయితే వాళ్లు ఎందుకోసం చిరంజీవి ని విమర్శిస్తున్నారు అనే దాని మీద ఎవరికి సరైన క్లారిటీ లేనప్పటికీ చిరంజీవి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక వీళ్లిద్దరూ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ మంచి హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మోహన్ బాబు కంటే కూడా చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగాడు.
మొదట్లో చిరంజీవి సినిమాల్లో మోహన్ బాబుని విలన్ గా చిరంజీవి రికమండ్ చేసి మరి పెట్టుకునేవాడు అప్పుడు మోహన్ బాబు కి పెద్దగా క్యారెక్టర్లు కూడా వచ్చేవి కావు, కానీ చిరంజీవి చనువుతో మంచి సినిమాలు చేసే అవకాశాలను కూడా పొందినట్టుగా ఇప్పటికి చాలామంది చెప్తూ ఉంటారు.
ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో జరిగిన వజ్రోత్సవ వేడుకలను ఉద్దేశించి మోహన్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేశాడు అవి ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ కలిసి ఇండస్ట్రీ కి చిరంజీవి అందించిన సేవలకు గాను తనకి గుర్తుండిపోయే విధంగా ఇండస్ట్రీ లో ఉన్న అందరి తరపున ఒక అవార్డుని ఇవ్వలనే ఉద్దేశ్యంతో తనకి ఒక అవార్డుని ప్రధానం చేశారు. ఇక దాంతో మోహన్ బాబు కొంతవరకు అప్సెట్ అయినట్టుగా కనిపించింది. అప్పుడే మోహన్ బాబు స్టేజ్ మీదకి వెళ్లి కొందరికి మాత్రమే అవార్డులు ఇవ్వడం ఏంటి? మేము కూడా ఇండస్ట్రీకి చాలా సంవత్సరాల పాటు మా సేవలను అందించాం కదా అవార్డ్ ఇస్తే అందరికీ ఇవ్వాలి. అనే అర్థం వచ్చేలా తను మాట్లాడటంతో అది చూసిన చిరంజీవి స్టేజ్ పైకి వెళ్లి ఇలా మా నటీనటుల మధ్య గొడవలు పుట్టించే ఈ అవార్డు నాకొద్దు అంటూ ఆ అవార్డుని తిరిగి రిటర్న్ చేయడం అప్పట్లో చాలా పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఇదంతా చూస్తున్న పవన్ కళ్యాణ్ స్టేజ్ పైకి వెళ్లి మోహన్ బాబుని ఉద్దేశిస్తూ తమ్ముడు మోహన్ బాబు అంటూ మాట్లాడాడు అప్పుడు ఈ న్యూస్ భారీగా వైరల్ అయింది. అయితే మోహన్ బాబు కి పవన్ కళ్యాణ్ కి ప్రత్యక్షంగా ఎక్కడ కూడా గొడవలు లేనప్పటికీ చిరంజీవికి అవార్డు ఇచ్చినప్పుడు మోహన్ బాబు అడ్డు మాట్లాడటం పట్ల కొంతవరకు అసహనానికి గురైన పవన్ కళ్యాణ్ అలాంటి మాటలు మాట్లాడాడు అంటు ఇప్పటికీ ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు…