Homeఎంటర్టైన్మెంట్'లవ్ స్టోరీ' రెడీ.. మరి రిలీజ్ పరిస్థితేంటి ?

‘లవ్ స్టోరీ’ రెడీ.. మరి రిలీజ్ పరిస్థితేంటి ?

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’ ఇప్పటికే ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. మరి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలా.. లేక థియేటర్లల్లో రిలీజ్ చేయాలా అని మేకర్స్ ఆలోచనలో పడ్డారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ కు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరను ఆఫర్ చేసిందట. ఒక్క డిజిటల్ రైట్స్ కే సుమారు 45 […]

Love Story Movie Release Date
హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’ ఇప్పటికే ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. మరి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలా.. లేక థియేటర్లల్లో రిలీజ్ చేయాలా అని మేకర్స్ ఆలోచనలో పడ్డారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ కు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరను ఆఫర్ చేసిందట. ఒక్క డిజిటల్ రైట్స్ కే సుమారు 45 కోట్లు ఆఫర్ చేస్తున్నారట. నిజంగా చైతూ గత సినిమాలన్నింటి కంటే ఇది భారీ ధరే అని చెప్పాలి. కాకపోతే లవ్ స్టోరీ పై మంచి అంచనాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

జీ5 కూడా భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడానికి ప్రధాన కారణం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేయడానికే. దానితో పాటు ఈ సినిమా కాంబినేషన్ అలాగే శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా ఈ సినిమా బిజినెస్ కి బాగా కలిసి వచ్చింది. ఎలాగూ శేఖర్ కమ్ముల అంటేనే సెన్సిబుల్ సినిమాల డైరెక్టర్ అనే బ్రాండ్ ఉంది కాబట్టి.. ఆయన సినిమాలు చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చుని ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చూడొచ్చు అనే నమ్మకం కూడా జనంలో బలంగా ఉంది కాబట్టి.. నిర్మాతలు డైరెక్ట్ గా థియేటర్ ల్లో రిలీజ్ చేస్తేనే బెటర్ అనే ఫీలింగ్ లో ఉన్నారు.

Also Read: బోల్డ్ వెబ్ సిరీస్ లో రాశి, నభా !

థియేటర్ ల్లో రిలీజ్ చేసినా.. సహజంగానే శేఖర్ కమ్ముల సినిమాలకు టీవీ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ లో మంచి డిమాండ్ ఉంటుంది. అప్పుడు థియేటర్ల రెవిన్యూ అనేది అదనపు ఆదాయం అవుతోంది. ఎలాగూ ప్రసుతం థియేటర్ లో సినిమా చూసే పరిస్థితి లేదు, భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేము. అందుకే ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా డిజిటల్ బాట పడుతున్నాయి. నాని ‘వి’, మిస్ ఇండియా రిలీజ్ అయ్యాయి.. ఇక సూర్య ‘ఆకాశమే హద్దుగా’, విజయ్ ‘మాస్టర్’ కూడా రిలీజ్ కానున్నాయి. మరి ఆ కోవలోనే క్రేజీ కాంబినేషన్ లో వస్తోన్న ‘లవ్ స్టోరీ’ కూడా రిలీజ్ అవుతుందా… లేక థియేటర్లలోనే రిలీజ్ అవుతుందా అనేది చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper