https://oktelugu.com/

Favorite Foods of Tollywood Heroes: మెగాస్టార్ నుంచి అల్లు అర్జున్ వరకు వారికిష్టమైన ఆహారపదార్థాలు

Favorite Foods of Tollywood Heroes: వయసు పెరుగుతున్నా స్టార్ హీరోలంతా ఎప్పుడూ ఒకే రకమైన ఫిట్ నెస్ తో కనిపిస్తారు. ఆ ఫిట్ నెస్ కి కారణం వాళ్ళు తీసుకునే ఆహారం. మరి తినే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే హీరోలలో.. ఏ హీరో ఏ వంటలను ఇష్టంగా తింటాడో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి : మెగాస్టార్ కి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే బాగా ఇష్టం. సీ ఫుడ్ తో పాటు చిరంజీవి […]

Written By:
  • Shiva
  • , Updated On : September 10, 2022 / 12:54 PM IST
    Follow us on

    Favorite Foods of Tollywood Heroes: వయసు పెరుగుతున్నా స్టార్ హీరోలంతా ఎప్పుడూ ఒకే రకమైన ఫిట్ నెస్ తో కనిపిస్తారు. ఆ ఫిట్ నెస్ కి కారణం వాళ్ళు తీసుకునే ఆహారం. మరి తినే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే హీరోలలో.. ఏ హీరో ఏ వంటలను ఇష్టంగా తింటాడో చూద్దాం.

    Favorite Foods of Tollywood Heroes:

    మెగాస్టార్ చిరంజీవి :

    మెగాస్టార్ కి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే బాగా ఇష్టం. సీ ఫుడ్ తో పాటు చిరంజీవి దోశలను కూడా ఇష్టంగా తింటారు.

    Also Read: Heroine Regina Cassandra: మగాళ్లు మ్యాగీ నూడుల్స్ టైపు రెండు నిమిషాల్లో అవుటైపోతారు… హీరోయిన్ రెజీనా బూతు జోక్!

    నందమూరి బాలకృష్ణ :

    బాలయ్య బాబు కూడా రొయ్యలను బాగా ఇష్టపడతారు. అలాగే చికెన్ బిర్యానీ కూడా బాలయ్యకి ఫేవరెట్. అయితే, ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంతం ఫుడ్ ని ఆస్వాదించడం బాలయ్యకి అలవాటు.

    విక్టరీ వెంకటేష్ :

    వెంకటేష్ నోస్టాలజిక్ కీమాను ఎక్కువ ఇష్టపడతారు. అలాగే వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకుని నోస్టాలజిక్ కీమాను తినడం అంటే వెంకటేష్ కు బాగా ఇష్టం అట.

    కింగ్ నాగార్జున :

    ఆరు పదుల వయసులో కూడా అందంగా కనిపించే నాగార్జున దోశ, చేపలు, గ్రిల్డ్ చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు.

    ప్రభాస్ :

    ప్రభాస్ కు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. అలాగే, సీ ఫుడ్ తో పాటు రోడ్ సైడ్ పానీపూరీని కూడా ప్రభాస్ ఇష్టంగా తింటారు.

    మహేష్ బాబు :

    మహేష్ వాళ్ళ అమ్మమ్మ గారు చేసే ప్రతి వంటను ఎంతో ఇష్టంగా తినేవారు. అయితే, ప్రస్తుతం మహేష్ ఇష్టమైన వంటకాలను కూడా డైటీషియన్ సలహాల ప్రకారమే తీసుకుంటున్నాడు.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ :

    పవన్ కళ్యాణ్ కి బాగా ఇష్టమైన వంటకం నెల్లూరు చేపల పులుసు. అలాగే, పప్పు, లెమన్ రైస్, అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసును కూడా పవన్ ఎంతో ఇష్టంగా తింటారు.

    జూనియర్ ఎన్టీఆర్ :

    Favorite Foods of Tollywood Heroes

    జూనియర్ ఎన్టీఆర్ ఫుడ్ లవర్ తో గ్రేట్ చెఫ్ కూడా. ఇక ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్.. రోటీ, నాటుకోడి ఖీమా. అలాగే ఎన్టీఆర్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా తింటాడు.

    రామ్ చరణ్ :

    చరణ్ కూడా బిర్యానీనే ఇష్టపడతారు. అలాగే చిరంజీవి దోశని కూడా చరణ్ ఇష్టంగా తింటాడు.

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ :

    స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయిన అల్లు అర్జున్ కి వాళ్ళ అమ్మగారు చేసే వంటలే ఫేవరేట్. అయితే, బన్నీ బిర్యానీని ఇష్టంగా తింటాడు.

    Also Read:Comedian Saptagiri: ఊహించని పరిణామం…నటుడు సప్తగిరి కాళ్ళు మొక్కబోయిన బాలయ్య!

    Tags