spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 6 Singer Revanth: నటిస్తూ బతకడం రాదు.. కంటెస్టెంట్స్‌పై విరుచుకుపడ్డ రేవంత్

Bigg Boss Telugu 6 Singer Revanth: నటిస్తూ బతకడం రాదు.. కంటెస్టెంట్స్‌పై విరుచుకుపడ్డ రేవంత్

Bigg Boss Telugu 6 Singer Revanth: బిగ్ బాస్ సీజన్ 6లో తొలి వారమే బరెస్ట్ అయిపోతున్నాడు సింగర్ రేవంత్. చిన్న చిన్న కారణాలకు అతడు భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నాడు. తొలి వారంలో సింగర్ రేవంత్ తోపాటు చలాకీ చంటి, శ్రీసత్య, ఫైమా, ఆరోహి, అభినయశ్రీ, ఇనాయాలు నామినేట్ అయ్యారు. అయితే అత్యధిక మంది ఇంటి సభ్యులు నామినేషన్ చేసింది సింగర్ రేవంత్ నే. తొలి వారంలో అతడి ప్రవర్తన.. దురుసు ప్రవర్తన.. ఒకరు చెప్పింది వినకుండా వారి మీద పడిపోతుండడంతో అందరూ నామినేట్ చేశారు. దీనికి రేవంత్ మరింతగా ఎమోషన్ కంట్రోల్ చేసుకోకుండా రెచ్చిపోతున్నాడు.. మాటలు అంటే పడను అంటూ ఎదురుదాడి చేస్తున్నాడు.

Bigg Boss Telugu 6 Singer Revanth
Singer Revanth

ఇప్పటికే ఫైమాతో, ఆరోహీ రావుతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఆరోహీ రావు తెలంగాణ యాసలో రేవంత్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. ఇక యూట్యూబర్ ఆది రెడ్డితోనూ రేవంత్ గొడవ పెట్టుకున్నాడు. వీరిద్దరినీ ఇంటి సభ్యులంతా దూరంగా తీసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక మిగలిన ఇంటి సభ్యులను కూడా మీ తీరు బాగోలేదంటూ తనకు సపోర్టు చేయడం లేదని అందరి ముందే అరుస్తున్నాడు. బాలాదిత్య, చంటి లాంటి వాళ్లు సర్ది చెప్పినా కూడా సింగర్ రేవంత్ వినడం లేదు.

Bigg Boss Telugu 6 Singer Revanth
Singer Revanth, arohi

అందరూ ఏకాకిని చేయడంతో రేవంత్ తాను ఇంటి నుంచి వెళ్లిపోతానని.. తాను యాక్ట్ చేస్తూ బతకడం రాదని.. ఇలా అయితే నన్ను పంపించేయండంటూ కెమెరా ముందు చెప్పుకుంటూ బాధపడ్డాడు. నచ్చకపోతే ప్రేక్షకులు ఓటు వేయవద్దని.. బిగ్ బాస్ కూడా తన ప్రవర్తన బాగాలేదంటే పంపించాలని కోరడం సంచలనమైంది.

దీంతో ఈ వారం వీకెండ్ లో హోస్ట్ నాగార్జున గట్టిగానే రేవంత్ కు క్లాస్ పీకడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. హౌస్ లోంచి వెళ్లిపోతానంటున్న రేవంత్ అసలు ఎందుకు వచ్చావంటూ గడ్డి పెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. బిగ్ బాస్ కూడా రేవంత్ కు ఇదే విషయంపై వార్నింగ్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. రేవంత్ ప్రవర్తనపై షాక్ ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version