https://oktelugu.com/

Anil Ravipudi : అనిల్ రావిపూడి కి మిగతా కమర్షియల్ డైరెక్టర్లకు మధ్య ఉన్న తేడా ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు

Written By:
  • Neelambaram
  • , Updated On : January 15, 2025 / 12:19 PM IST

    Anil Ravipudi

    Follow us on

    Anil Ravipudi : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దానివల్లే వాళ్ళు చేస్తున్న సినిమాలు సక్సెస్ లను సాధిస్తూ వాళ్లకు మంచి గుర్తింపును కూడా తీసుకొస్తూ ఉంటాయి. మరియు ఎప్పుడూ ఒకే తరహా సినిమాలను చేసి ప్రేక్షకులకు బోరు కొట్టించే కంటే కొత్త కథలను ఎంచుకోవడంలో దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు…

    ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భారీ మార్పులైతే వచ్చాయి. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకు పెద్దపీటవేసే ప్రేక్షకులు ఇప్పుడు వైవిద్య భరితమైన సినిమాలకు మాత్రమే పట్టం కడుతూ సూపర్ సక్సెస్ గా నిలుపుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది కమర్షియల్ డైరెక్టర్లు తమదైన రీతిలో కమర్షియల్ సినిమాలను చేసి కూడా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్ లందరూ వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిల్ రావిపూడి సైతం ఈ సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో మంచి విజయాన్ని సాధించి మరోసారి తను స్టార్ డైరెక్టర్ గా పేరునైతే సంపాదించుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతోనే కాకుండా ఇప్పటివరకు ఆయన చేసిన 8 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడానికి గల కారణం ఏంటి కమర్షియల్ డైరెక్టర్లకి కాలం చెల్లిపోతున్న రోజుల్లో కమర్షియల్ సినిమాలనే ఎజెండాగా నమ్ముకుని ముందుకు సాగుతున్న అనిల్ రావిపూడి కి మిగతా దర్శకులకు మధ్య ఉన్న తేడా ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    మిగతా కమర్షియల్ డైరెక్టర్లందరు స్టోరీని కమర్షియల్ వే లో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాని వల్ల ఇంతకుముందు ఈ సీన్లను మనం చూశాం కదా ఆ సీన్ యొక్క ఇంపార్టెన్స్ ఇతర సినిమాలో హెవీగా ఉంటే ఈ సినిమాలో పెద్దగా లేదు అదే యాక్షన్ సీన్స్ అవే పాటలు రొటీన్ స్టోరీ అంటూ చాలామంది చాలా రకాల విమర్శలు అయితే చేస్తూ ఉంటారు.

    కానీ అనిల్ రావిపూడి దగ్గరకు వచ్చేసరికి తెలిసిన కథ అయినా కూడా ఆయన చాలా సెన్సిబుల్ గా ఆ కథను చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. నిజానికి ప్రతి క్యారెక్టర్ ను బాగా వాడుకుంటూ క్యారెక్టర్ కి ఒక మేనరిజం ని ఇచ్చి దానిని సక్సెస్ గా విజయవంతంగా ప్రేక్షకులకు చేయవేయడంలో ఆయన ఎక్స్ పర్ట్ అనే చెప్పాలి.

    ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధించడానికి కూడా ఇవే ముఖ్య కారణంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక తను రాసుకున్న సీన్స్ తాలూకు ట్రీట్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.