Delhi Weather : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు ప్రజలకు ఇబ్బందులను సృష్టించింది. చాలా ప్రాంతాలలో దృశ్యమానత దాదాపుగా సున్నాగా ఉంది. దృశ్యమానత చాలా తక్కువగా ఉండడం వల్ల రోడ్లపై వాహనాల హెడ్‌లైట్లు, పార్కింగ్ లైట్లు వేసుకుని కనిపిస్తున్నారు. దీనితో పాటు, వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది. ఈరోజు కూడా తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది.
ఢిల్లీకి వచ్చే చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదే సమయంలో, ఢిల్లీ విమానాశ్రయంలో దృశ్యమానత తక్కువగా ఉండటం వల్ల విమాన సేవలు కూడా ప్రభావితమవుతాయి. ఈ రోజు ఇప్పటివరకు 184 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 7 విమానాలు రద్దు చేయబడ్డాయి. బుధవారం సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వాతావరణం స్పష్టంగా ఉంది.
#WATCH | Delhi | Visibility in the national capital is affected as a layer of dense fog engulfs the city
Visuals from Nirankari Colony pic.twitter.com/EPK03CGCH4
— ANI (@ANI) January 15, 2025
మంగళవారం ఉదయం కొంతసేపు పొగమంచు ఉంది.. లేటుగా సూర్యుడు బయటకు వచ్చాడు. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా 21.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా 8.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
#WATCH | Delhi | A dense layer of fog engulfs the national capital as cold wave intensifies in Northern India.
Visuals from India Gate and surrounding areas pic.twitter.com/X4mpFsSCRt
— ANI (@ANI) January 15, 2025
చాలా రైళ్లు రద్దు
వాతావరణం దృష్ట్యా రైల్వేశాఖ అనేక రైళ్లను రద్దు చేసింది. వీటిలో 14617-18 అమృత్‌సర్ జనసేవా ఎక్స్‌ప్రెస్ (మార్చి 2 వరకు), 14606-05 రిషికేశ్ జమ్మూ తావి ఎక్స్‌ప్రెస్ (ఫిబ్రవరి 24 వరకు), 14616-15 అమృత్‌సర్ లాల్కువాన్ ఎక్స్‌ప్రెస్ (మార్చి 22 వరకు), 14524-23 అంబాలా హరిహర్ ఎక్స్‌ప్రెస్ (ఫిబ్రవరి 27 వరకు) ఉన్నాయి. 18103-04 జలియన్ వాలాబాగ్ ఎక్స్‌ప్రెస్ (ఫిబ్రవరి 28 వరకు), 12210-09 కత్గోడం కాన్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (ఫిబ్రవరి 25 వరకు), 14003-04 మాల్డా టౌన్ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (మార్చి 1 వరకు) రద్దు చేయబడ్డాయి.
పొగమంచు సమయంలో ప్రమాదాలను నివారించడానికి.. ప్రయాణీకుల భద్రత నిమిత్తం ఈ చర్యలు తీసుకున్నట్లు భారత రైల్వేలు నొక్కిచెప్పాయి. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని రైల్వే స్టేషన్‌లో తమ రైలు స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించారు.
ఢిల్లీ ఏక్యూఐ ఎంత?
బుధవారం ఉదయం ఢిల్లీలో AQI 319గా నమోదైంది. ఇది వెరీపూర్ కేటగిరిలోకి వస్తుంది. సున్నా – 50 మధ్య AQI మంచిదని, 51 – 100 సంతృప్తికరంగా ఉందని, 101 – 200 ఫర్వాలేదని, 201 – 300 పూర్, 301 – 400 వెరీ పూర్, 401 – 500 డేంజర్ కేటగిరీలుగా వాతావరణ శాఖ వర్గీకరించింది.