Coolie-KGF: రజినీకాంత్ కూలీ కి, యశ్ కేజీఎఫ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

లోకేష్ కనకరాజ్ మాత్రం ఈ సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తన గత చిత్రమైన లియో సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు.

Written By: Gopi, Updated On : April 24, 2024 3:36 pm

What is the connection between Rajinikanth Kooli and Yash KGF

Follow us on

Coolie-KGF: ప్రస్తుతం చాలామంది దర్శకులు వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చడంలో తీవ్రమైన కృషి చేస్తూ ఎట్టకేలకు సక్సెస్ అయితే అవుతున్నారు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్ కావడం అలాగే వాళ్ళు సినిమా స్టోరీలను బాగా రాసుకొని ఆ హీరో మేనరిజమ్స్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ ను మలుచుతూ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చిన కే జి ఎఫ్ సినిమా గోల్డ్ మాఫియాను బెస్ చేసుకొని తీశారు.

ఇక అదే కాన్సెప్ట్ తో ఇప్పుడు లోకేష్ కనకరాజ్ కూడా సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమాకు సంబంధించిన టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా కూడా గోల్డ్ మాఫీయా చుట్టూ తిరిగే కథగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా కి కే జి ఎఫ్ సినిమాకి మధ్య దగ్గర పోలికలు ఉన్నాయనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమా స్టోరీ కి కే జి ఎఫ్ సినిమా స్టోరీకి దగ్గర సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇక ఏదేమైనప్పటికీ లోకేష్ కనకరాజ్ మాత్రం ఈ సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తన గత చిత్రమైన లియో సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. కాబట్టి మరోసారి ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రజనీకాంత్ కి కనక తను హిట్ ఇచ్చినట్టయితే ఆయన పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగుతుందనే చెప్పాలి.

ఆయనతో ఒక సినిమా కనుక బ్లాక్ బస్టర్ పడితే ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోతుందనే చెప్పాలి…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేజీఎఫ్ కి కూలీ కి మధ్య ఎలాంటి సంబంధం లేదు. రెండు స్టోరీ లు వేరేగా ఉంటాయి అంటూ సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే గాని ఈ సినిమాల స్టోరీలు ఒకేటేనా కాదా అనే విషయాలు స్పష్టంగా తెలిసే అవకాశాలు అయితే లేవు…