https://oktelugu.com/

Venu Swamy: ఆ మెగా హీరో భార్యకు విడాకులు ఇస్తాడు… సంచలనం రేపుతున్న వేణు స్వామి జ్యోతిష్యం!

సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే చెప్పడం విశేషం. ఇలాంటి కొన్ని ఘటనలు వేణు స్వామి చెప్పినట్లే జరిగాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : April 24, 2024 / 03:40 PM IST

    Venu Swamy Predicts Divorce for Lavanya Tripathi and Varun Tej

    Follow us on

    Venu Swamy: వేణు స్వామి ఓ మెగా హీరో మీద చేసిన కామెంట్స్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయనకు విడాకులు తప్పని వేణు స్వామి కుండబద్దలు కొట్టాడు. వేణు స్వామి గతంలో ఇలా కొందరు సెలబ్రిటీ జంటల గురించి చేసిన కామెంట్స్ నిజమైన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. వేణు స్వామి టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ భవిష్యత్ అంచనా వేస్తూ ఫేమస్ అయ్యాడు. జాతకాల ఆధారంగా వాళ్ళ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో ఆయన అంచనా వేస్తాడు.

    సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే చెప్పడం విశేషం. ఇలాంటి కొన్ని ఘటనలు వేణు స్వామి చెప్పినట్లే జరిగాయి. అలాగే ఈయనకు పలువురు స్టార్ హీరోయిన్స్ భక్తులు. ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకుంటే కెరీర్లో తిరుగు ఉండదని భావిస్తారు. రష్మిక మందాన, డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ వంటి పలువురు హీరోయిన్స్ వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.

    కాగా వరుణ్ తేజ్ కి కూడా విడాకులు తప్పవని వేణు స్వామి చెప్పడం సంచలనంగా మారింది. ఆయన మాట్లాడుతూ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి భవిష్యత్ లో విడిపోతారు. వీరిద్దరి జాతకంలో శుక్రుడు ,గురుడు నీచంలో ఉన్నారు. లావణ్య త్రిపాఠికి కుజ దోషం ఉంది. వరుణ్ తేజ్ కి నాగ దోషం ఉంది. నిజానికి వీళ్లకు పెళ్లి యోగం లేదు. పెళ్లి జరగడమే అద్భుతం. కానీ కలిసి జీవించి ఉండడం కష్టం… అన్నాడు. వాళ్ళ జాతకం ప్రకారమే నేను చెబుతున్నా అన్నాడు.

    వేణు స్వామి కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొత్తగా పెళ్లి చేసుకుని అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న వరుణ్, లావణ్యల మీద అనుచిత కామెంట్స్ చేయడం సరికాదని వాపోతున్నారు. కాగా మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్-లావణ్య కలిసి నటించారు. అప్పుడు మొదలైన పరిచయం ప్రేమగా మారింది.ఏళ్ల తరబడి వీరు రహస్యంగా ప్రేమించుకున్నారు. కొన్నాళ్లుగా పుకార్లు మొదలయ్యాయి. అయితే ఎఫైర్ రూమర్స్ ని లావణ్య ఖండించారు.

    గత ఏడాది నిశ్చితార్థం జరుపుకున్న వరుణ్-లావణ్య నవంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. ఇటలీ దేశంలో వీరి పెళ్లి జరిగింది. కేవలం బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. మెగా హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, అల్లు శిరీష్ సందడి చేశారు. పెళ్లి తర్వాత కూడా లావణ్య నటన కొనసాగిస్తోంది. మిస్ పర్ఫెక్ట్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది.