Prabhas : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. అయితే ప్రభాస్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదగడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా ముందుకు సాగుతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకున్న ప్రభాస్ సైతం వరుస సినిమాలను చేస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. బాహుబలి 2 సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్స్ ను కూడా రాబట్టిన ఈ స్టార్ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత విజయాలను అందుకొని కలెక్షన్ల సునామిని సృష్టించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానికోసమే ఆయన వరుసగా చాలామంది దర్శకులను లైన్ లో పెట్టుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఇంతకుముందు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోయే సినిమాలు మరొక ఎత్తులో ఉండే విధంగా చూసుకొని మరి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. ప్రభాస్ తో సినిమా చేయడంలో గాని, తన అభిమానులను చూసుకోవడంలో గాని ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. అలాగే అతిధి మర్యాదలను చేయడంలో కూడా తను చాలా గొప్ప స్థాయిలో ఉంటాడని చాలామంది తన కో ఆర్టిస్టులు కూడా చెబుతూ ఉంటారు.
మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ లాంటి హీరో సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తున్నప్పటికి అతనికి ఒక బ్యాడ్ హాబిట్ అయితే ఉందని కొంతమంది నటులు చెబుతున్నారు. అది ఏంటి అంటే ప్రభాస్ షూటింగ్ స్పాట్ లో ఎక్కువగా సిగరెట్లు తాగుతూ ఉంటారట. ఇక దానివల్ల ఆయనకి కొంతవరకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయని మరికొందరు కామెంట్స్ అయితే చేస్తున్నారు.
ఇక ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఎక్కువగా సిగరెట్లు తాగడం వల్ల ఆయన గొంతులో బేస్ అయితే పెరిగిందని మరి కొంతమంది చెబుతూ ఉండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి గొప్ప హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీని శాశిస్తున్నాడనే చెప్పాలి. మరి ఆయన నుంచి ఒక సినిమా రావాలి అంటే కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం అనే చెప్పాలి. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను కలెక్ట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఆయన అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ లను సాధించి ఆయనకంటూ ఒక ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలను చేస్తున్నాడు. అలాగే మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజాసాబ్ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాబట్టి ఈ సినిమాని 2025 మార్చ్ లో రిలీజ్ చేయాలని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…