Puneeth Rajkumar: కన్నడ కథానాయకుడు రాజ్ కుమార్ మరణం తీరని లోటు అని సినీ అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. బెంగుళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కర్ణాటలో విషాద చాయలు అలుముకున్నాయి తమ అభిమాన నటుడు లేకపోవడంపై అందరిలో ఆందోళన పెరిగింది.

రాజ్ కుమార్ మరణంపై విక్రమ్ ఆస్పత్రి వైద్యులు ఓ బులెటిన్ విడుదల చేశారు. ఆయన కార్డియాక్ అసిస్టోల్ కు గురయ్యారని చెప్పారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన శరీరం వైద్యానికి సహకరించకపోవడంతోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. ఆయనను కాపాడాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని వివరించారు.
ఇప్పుడు కార్డియాక్ అసిస్టోల్ పదం అందరిలో నానుతోంది. ఆయన హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన పరిస్థితులపై డాక్టర్లు వివరణ ఇచ్చారు. దీంత రాజ్ కుమార్ మృతి చర్చనీయాంశం అవుతోంది.ఆయన మరణంపై కన్నడ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కార్డియాక అసిస్టోల్ కు గురైన వ్యక్తి నిమిషాల్లోనే చనిపోతారని నిపుణులు చెబుతున్నారు.
Also Read: అంగట్లో అన్నీ ఉన్నా ఈ హీరో నోట్లో శని !
గుండె కవాటాలు పట్టు తప్పిపోవడంతోనే ఈ వ్యాధి సోకుతుందని తెలుస్తోంది. దీంతో ఈ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వారు బయటకు రావడం పదిశాతం లోపే అని తెలుస్తోంది. దీంతోనే ఆయన మరణం సంభవించినట్లు సమాచారం. మొత్తానికి కన్నడ కథానాయకుడు రాజ్ కుమార్ మరణం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.