Mahesh Babu: అందుకే మహేష్ సోషల్ మీడియా రారాజు !
Mahesh Babu: సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం చాలా మారిపోయింది. సాధారణ వ్యక్తులు కూడా సెలబ్రిటీలుగా మారిపోయిన సంఘటనలు సోషల్ మీడియా యుగంలో జరిగాయి. మరి సామాన్యులకు అంత క్రేజ్ ఉన్నప్పుడు.. ఇక సెలబ్రిటీలకు ఎంత క్రేజ్ ఉండాలి ? కేవలం సెలబ్రిటీలను ఫాలో కావడానికే తమ సమయాన్ని వెచ్చించే వారెంతో మంది ఉన్నారు. అయితే, సినిమాల్లో ఎంత స్టార్ డమ్ ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్ల నుంచి గొప్ప అమితాదరణను సంపాదించుకోవడం అంత ఈజీ […]

Mahesh Babu: సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం చాలా మారిపోయింది. సాధారణ వ్యక్తులు కూడా సెలబ్రిటీలుగా మారిపోయిన సంఘటనలు సోషల్ మీడియా యుగంలో జరిగాయి. మరి సామాన్యులకు అంత క్రేజ్ ఉన్నప్పుడు.. ఇక సెలబ్రిటీలకు ఎంత క్రేజ్ ఉండాలి ? కేవలం సెలబ్రిటీలను ఫాలో కావడానికే తమ సమయాన్ని వెచ్చించే వారెంతో మంది ఉన్నారు.
అయితే, సినిమాల్లో ఎంత స్టార్ డమ్ ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్ల నుంచి గొప్ప అమితాదరణను సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే సోషల్ మీడియానే స్టార్లను క్రియేట్ చేస్తోంది. అందుకే స్టార్లు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ పరిధిని పరపతిని పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు పోస్ట్ లతో ఫోటో గ్యాలరీలతో హల్ చల్ చేస్తూ ఉంటారు.
కానీ నెటిజన్లను ఎక్కువగా ఇంప్రెస్ చేసే వారు మాత్రం కొందరే. ముందుగా బాలీవుడ్ విషయానికి వద్దాం..క్రేజీ బ్యూటీ దీపికా పదుకునే.. సోషల్ మీడియాలో ఆమెకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఆమె కూడా ఆ ఆదరణను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ నంబర్ వన్ సోషల్ మీడియా బ్యూటీగా ఇంకా కొనసాగుతూనే ఉంది.
నిత్యం మంచి మంచి పోస్టులు పెడుతూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది కాబట్టే.. ప్రియాంక చెప్రా, దిశా పటానీ, కరీనా కపూర్ లాంటి టాప్ బ్యూటీలను కూడా వెనక్కి నెట్టి.. దీపికా ముందుకు వెళ్ళింది. ఇక హీరోల్లో షారుఖ్, సల్మాన్ లకు మంచి ఫాలోయింగ్ ఉంది. అదే టాలీవుడ్ విషయానికి వస్తే.. సోషల్ మీడియా రారాజుగా వెలిగిపోతుంది మహేష్ బాబు ఒక్కడే.
Also Read: Bala Krishna: పునీత్ రాజ్ కుమార్ మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమైన బాలయ్య…
ఏ హీరోకి లేనంత మంది ఫాలోవర్స్ మహేష్ కి ఉన్నారు. 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సాధించాడు మహేష్. అదే ఎన్టీఆర్, బన్నీ 5 మిలియన్ల దగ్గరే ఉన్నారు. ఇక చరణ్, ప్రభాస్ అయితే, చాలా వెనుకబడి ఉన్నారు. మహేష్ కి సోషల్ మీడియాలో అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం.. తనకు తన ఫ్యామిలీకి సంబంధించి పిక్స్ ను, వీడియోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ.. తన ఫాలోయర్లకు అనునిత్యం ఆకట్టుకుంటూ ఉంటాడు. అందుకే మహేష్ సోషల్ మీడియా రారాజు అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు.
Also Read: Ravi Teja: రవితేజ అత్యాశ.. అయోమయంలో దర్శకుడు !
