Allu Arvind: పుష్ప చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియా వైడ్ ఆడియన్స్ ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ లో క్రేజ్ విపరీతంగా ఏర్పడింది. పుష్ప 2 హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూ. 200 కోట్లకు అమ్మారని సమాచారం. ఇది ఒక తెలుగు సినిమాకు అత్యధిక మొత్తం. కల్కి చిత్రానికి ఈ స్థాయిలో బిజినెస్ జరగలేదు. ఇక అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ రూ. 300 కోట్లకు పైమాటే అట. ఫోర్బ్స్ విడుదల చేసిన హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నాడు.
డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల కానుంది. సుకుమార్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించగా.. రెండు రోజుల వరకు కూడా షూటింగ్ జరిగింది. దాంతో నిర్మాతలు కొంత ఆందోళను గురయ్యారు. ఐదు భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. అన్ని భాషల్లో సెన్సార్ చేయించాలి. అందుకు సమయం పడుతుంది. కాగా ఫస్ట్ కాపీ చకచకా పూర్తి చేశారట. పుష్ప 2 సెన్సార్ జరుపుకోగా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం అందుతుంది.
అలాగే అన్నపూర్ణ స్టూడియోలో అల్లు అర్జున్, సుకుమార్, అల్లు అరవింద్ ఫస్ట్ కాపీ చూశారట. అల్లు అరవింద్ మూవీ బ్లాక్ బస్టర్ అని తేల్చేశాడట. ముగ్గురూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారట. సినిమా ముగిశాక అల్లు అర్జున్, సుకుమార్ ఆలింగం చేసుకున్నారట. ఇక సెన్సార్ సభ్యుల సమాచారం ప్రకారం అదిరిపోయే ట్విస్ట్ లు , హైప్ ఇచ్చే సన్నివేశాలతో పుష్ప ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందట.
ముఖ్యంగా సినిమాలో కొన్ని హైలెట్స్ ఉన్నాయట. జాతరలో సాంగ్ గూస్ బంప్స్ లేపుతుందట అలాగే ఎమోషనల్ యాంగిల్ కూడా బలంగా చెప్పారట. భార్య శ్రీవల్లితో పుష్పరాజ్ ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ మనసులను హత్తుకుంటాయని అంటున్నారు. ఇక ఫహద్ ఫాజిల్- అల్లు అర్జున్ కాంబినేషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ పుష్ప 2 చిత్రానికి ప్రధాన బలం అని సెన్సార్ రిపోర్ట్. మొత్తంగా పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయనుందట.
మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 మూవీ నిర్మించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలీల ఓ ఐటెం సాంగ్ చేసింది.