Chittoor District: మేత మేస్తున్న ఓ గోమాత..పిచ్చి మొక్కల మధ్య పాడుబడిన బావిని చూడలేదు.పాడి రైతు చూసుకునే లోగా అటువైపు వెళ్ళింది. ఆ ఇరుకైన బావిలో పడిపోయింది. రెండు కాళ్లు కూరుకుపోయాయి.బయటకు రాలేని దినస్థితి.ఇరుకు బావి కావడంతో సహాయ చర్యలు చేపట్టిన బయటకు రాలేని పరిస్థితి. ఈ తరుణంలో ఊపిరాడక ఆ గోమాత కనుగుడ్లు తేలిపోయాయి.దీంతో అంతా ఆశలు వదులుకున్నారు. దాదాపు 6 గంటలపాటు యంత్రంతో సమాంతరంగా బావిని తవ్వి గోమాతను బయటకు తీశారు.అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ఆ గోమాత ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితేవారు పడిన శ్రమ కంటే.. ధైర్యం కూడా తీసుకొని ఆ ఆవు ప్రాణాలు నిలుపుకోవడం విశేషం. చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన.
* చుట్టూ పిచ్చి మొక్కలు.. మధ్యలో బావి
చౌడేపల్లి మండలం దిగువ పల్లె పంచాయితీ అప్పిన పల్లె శివార్లలో చంద్ర అనే రైతుకు చెందిన పాడి ఆవు మేతకు వెళ్ళింది. అప్పుడెప్పుడో పురాతన బావి అది.నిటారుగా ఉండేది. చుట్టూ పిచ్చి మొక్కలు ఉండడంతో చూసుకొని ఆ ఆవు బావిలో దిగబడిపోయింది. గంటల తరబడి అందులో చిక్కుకుంది. చివరకు ఆ బావిలో పడిపోయినట్లు గుర్తించిన చంద్ర గ్రామస్తుల సహకారంతో దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.కానీ బావి ఇరుకుగా, నిటారుగా ఉండడంతో బయటకు రాలేని పరిస్థితి. దీంతో సర్పంచ్ ప్రతినిధి వెంకటరెడ్డి తో పాటు గ్రామస్తులు ఆరు గంటలపాటు శ్రమించారు. దానికి పునర్జన్మ ప్రసాదించారు.
* జెసిబితో తవ్వి
బావి నిటారుగా ఉండడంతో దానికి సమాంతరంగా జెసిబితో తవ్వకాలు చేశారు. తవ్విన తర్వాత ఆవుకు తాడు కట్టి బయటకు లాగే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆవు అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ చేతనంగా ఉండడంతో ఆశలు వదులుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆవు కళ్ళుతెరిచేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మృత్యుంజయిరాలిగా నిలిచిన ఆవును చూసి గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.