https://oktelugu.com/

Niranjan Reddy : అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు…సస్పెన్స్ కి తెర దించేది ఎప్పుడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక అందులో అల్లుఅర్జున్ ఒకరు...

Written By: , Updated On : December 28, 2024 / 03:01 PM IST
Niranjan Reddy

Niranjan Reddy

Follow us on

Niranjan Reddy : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక అందులో అల్లుఅర్జున్ ఒకరు… ప్రస్తుతం భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది…

అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఈ సందర్భంలో ఆయన మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాకుండా తనకంటూ ఒక స్టార్ డమ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆమె మృతి పట్ల పెద్దలందరూ సానుభూతిని తెలియజేయడంతో పాటు ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలబడతామంటూ హామీలైతే ఇస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ విషయంలో అల్లు అర్జున్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా థియేటర్ దగ్గరికి వచ్చాడని పోలీసులు అతని మీద కేసును ఫైల్ చేశారు. ఇక మొత్తానికైతే ఈ కేసు ఇప్పుడు భారీ మలుపులు తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో హైకోర్టు అతనికి మధ్యంతర బేయిలైతే మంజూరు చేసింది. ఇక బెయిలు గడువు తేదీ కూడా ముడిగిసిపోతుంది. దాంతో జనవరి 10వ తేదీన ఆయన హైకోర్టు లో హాజరు కావలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఆరోజు అల్లు అర్జున్ నిరంజన్ రెడ్డి ఇలాంటి ఆధారాలను చూపించి అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయట పడేస్తాడనే ధోరణిలోని అందరూ ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏం చేయాలనే పరిస్థితి అయితే ఉంది.

ఎందుకంటే ఒకసారి కోర్టులోకి కేసు వెళ్లిన తర్వాత దానికి ఎలాంటి రాజకీయ ప్రమేయాలయితే ఉండవు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకోవడం తప్ప ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశమైతే లేదు. మరి ఎవరు ప్రూఫ్ తో వచ్చి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ప్రూవ్ కావాలంటే జనవరి 10వ తేదీ రావాల్సిందే…

మరి ఏది ఏమైనా కూడా ఈ కేసు విషయంలో పోలీసులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక నిరంజన్ రెడ్డి మీద అల్లు అర్జున్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి జరిగిన సంఘటన ఏదో జరిగిపోయింది దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లించడం గాని అందరూ సానుభూతి తెలియజేయడం గాని అన్ని జరిగిపోయాయి.

మరి ఇప్పుడు అల్లు అర్జున్ కనుక జైలుకి వెళ్తే ఆయన కెరియర్ కూడా చాలావరకు ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది సినీ పెద్దలు సైతం అల్లు అర్జున్ కు సపోర్టుగా నిలుస్తున్నట్టుగా తెలుస్తోంది…