పైగా అందంగా ఉండేవాడు. చదువుకున్నవాడు, అన్నిటికీ మించి మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ ఉన్నవాడు కూడా. మొత్తానికి చిరంజీవికి పోటీ వచ్చాడు అనుకుంటున్న సమయంలో.. ఓ అనుకోని సంఘటన తో అడ్డంగా ఇరుకున్నాడు సుమన్. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి లేని పోనీ పుకార్లు పుట్టించారు. పైగా సుమన్ కూడా రెండేళ్ళు జైలులో ఉండి వచ్చాడు.
దాంతో కెరీర్ దెబ్బ తింది. అయితే, ఇప్పటికి చాలామంది అనుకునే రూమర్ ఏమిటి అంటే.. సుమన్ కెరీర్ నాశనం కావడానికి చిరంజీవి హస్తం కూడా ఉంది అంటూ ఓ బలమైన వార్త క్రియేట్ చేశారు. అయితే, ఇందులో చిరంజీవికి కానీ, సినిమా ఇండస్ట్రీకి కానీ ఎలాంటి ప్రమేయం లేదు అని స్వయంగా సుమనే ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
పైగా సినిమా రంగం నుంచి మోహన్ బాబు, సుమలత, సుహాసిని, భానుప్రియ, భాను చందర్, నూతన ప్రసాద్, అలాగే కొంతమంది దర్శక నిర్మాతలు కూడా సుమన్ కి ఆ సమయంలో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే ధైర్యం చెప్పారు, ముఖ్యంగా మోహన్ బాబు చాలా అండగా నిలబడ్డారు. అయినా పరిశ్రమలో ఎన్నో జరుగుతుంటాయి.
దానికి ఏ సంబంధం లేని వారి పేరును ఎందుకు తీసుకువస్తారో ? అసలు, సుమన్ కెరీర్ చిరంజీవి కెరీర్ కన్నా ఎప్పుడు బెటర్ గా లేదు. పైగా మెగా విజయ రథాన్ని, పథాన్ని ఎవ్వరు ఏ నాడు ఆపలేకపోయారు, ఇక అలాంటప్పుడు సుమన్ అవకాశాలను దెబ్బ తీయాల్సిన అవసరం మెగాస్టార్ కి ఎందుకు ఉంటుంది.