
టాలీవుడ్ అగ్రహీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల పిల్లలు నెట్టింట్లో సందడి చేశారు. వీరికి సోషల్ మీడియాలో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఇప్పటికే చిలిపి అల్లరి పనులతో అల్లుఅర్జున్ కూతురు అల్లు అర్హ చేసే సందడి అంతా ఇంతా కాదు.. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ అప్పుడే పెద్దవాడు అయిపోయి హీరో షేప్ వచ్చేసింది. తన స్టైలిష్ లుక్స్ తో అకీరా నందన్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు.
తాజాగా వీరిద్దరూ మరోసారి నెట్టింట్లో సందడి చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శాంకుతల’. ఈ సినిమాలో చిన్నప్పటి పాత్రలో అల్లు అర్హ నటిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ లో పాల్గొన్న అర్హ మరోసారి సెట్ లో అడుగుపెట్టింది.ఈ క్రమంలోనే మేకప్ మెన్ అల్లు అర్హకు వేస్తున్న మేకప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#AlluArha is back on the sets. The little Prince Bharata joins the ongoing schedule of the mythological drama #Shaakuntalam, which is currently underway in Hyderabad @alluarjun @Samanthaprabhu2 @Gunasekhar1@neelima_guna @neeta_lulla @GunaaTeamworks pic.twitter.com/l03FKZFBrK
— Shreyas Sriniwaas (@shreyasmedia) August 3, 2021
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సినిమాలో కర్రసాము, కత్తిసాము చేసి అలరించాడు. ఇప్పుడు తండ్రిని గుర్తుచేస్తూ ఆయన తనయుడు అకీరానందన్ కర్రసాముతో ఊపేసాడు. కర్రను వేగంగా తిప్పుతూ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోను పవన్ ఫ్యాన్స్ తెగ షేర్లు చేస్తూ ‘తండ్రికి తగ్గ తనయుడు’ అంటూ అభిమానులు హోరెత్తిస్తున్నాడు.
ఇద్దరు స్టార్ హీరోల పిల్లలు ఇలా ఒకేరోజు.. ఒకసారి చేసిన పనులు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. వారి అభిమానులు తెగ షేర్లు చేస్తూ హోరెత్తిస్తున్నరు.