Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ కామెడీ హీరో అవ్వడానికి సీనియర్ ఎన్టీయార్ ఏం చేశాడు..?

ఎన్టీయార్ ఉదాహరణ గా నేను పౌరాణికాలు చేస్తా, నాగేశ్వర రావు లవ్ సినిమాలు చేస్తాడు.కృష్ణ కమర్షియల్ సినిమాలు చేస్తాడు, శోభన్ బాబు ఫ్యామిలీ సినిమాలు చేస్తాడు.ఇలా ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో సెటిల్ అయి ఉన్నారు.

Written By: Gopi, Updated On : October 3, 2023 4:17 pm

Rajendra Prasad

Follow us on

Rajendra Prasad: సినిమా ఇండస్ట్రీ లోఉన్న చాలా మంది నటులలో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఈయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చాలా సినిమాల్లో నటిస్తూ నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు అప్పట్లో హిట్ సినిమాలు గా నిలిచాయి. ఈయన చేసిన సినిమాలు అన్ని కూడా కామెడీ ప్రధానం గా నడిచేవి కావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.అయితే రాజేంద్ర ప్రసాద్ ఎందుకు కామెడీ సినిమాలు చేస్తున్నాడు అప్పుడు ఉన్న హీరోలందరు కూడా మాస్ సినిమాలు చేస్తుంటే రాజేంద్ర ప్రసాద్ ఒక్కడే కామెడీ సినిమాలు ఎందుకు చేసాడు అనే డౌట్ అందరికి వస్తుంది.

ఆయన కామెడీ సినిమాలు ఎందుకు చేసాడో తెలియాలంటే మీరు ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే ఆయన ఇండస్ట్రీ కి రావాలి అనుకున్నపుడు సీనియర్ ఎన్టీయార్ ఈయనకి దగ్గర బంధువు కావడం తో ఒకరోజు ఆయన్ని కలవడానికి రాజేంద్ర ప్రసాద్ వెళ్ళినప్పుడు ఎన్టీయార్ గారితో రాజేంద్రప్రసాద్ నేను కూడా సినిమాల్లోకి వస్తాను అన్నయ్య, నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం అని చెప్పినప్పుడు ఎన్టీయార్ సరే నువ్వు సినిమాల్లోకి వస్తావ్ బాగానే ఉంది కానీ ఇప్పటికే ఇక్కడ చాలా మంది హీరో లు ఉన్నారు వాళ్ళని కాదని ప్రేక్షకులు నిన్ను ఆదరించాలంటే నువ్వు కూడా వాళ్ళ లానే చేస్తే కుదరదు వాళ్ళకి మించి వెరైటీ గా ఏమైనా చేయాలి అప్పుడే నిన్ను ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పాడు.

అలా చెప్తూనే ఎన్టీయార్ ఉదాహరణ గా నేను పౌరాణికాలు చేస్తా, నాగేశ్వర రావు లవ్ సినిమాలు చేస్తాడు.కృష్ణ కమర్షియల్ సినిమాలు చేస్తాడు, శోభన్ బాబు ఫ్యామిలీ సినిమాలు చేస్తాడు.ఇలా ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో సెటిల్ అయి ఉన్నారు. అలాంటప్పుడు మేము చేసిందే నువ్వు చేస్తే ఎవరు చూడరు కాబట్టి నువ్వు సెపరేట్ గా ఒక జానర్ లో సినిమాలు చేయి అలా అయితేనే నిన్ను జనాలు ఆదరిస్తారు నువ్వు కూడా ఒక మంచి హీరోవి అవుతావు అని చెప్పాడట.ఏ సినిమాలు చేస్తావో నువ్వే ఆలోచించుకొని మళ్లీ కలిసినప్పుడు చెప్పు అనగానే సరే అని రాజేంద్రప్రసాద్ వెళ్ళిపోయాడట…

దాంతో రాజేంద్ర ప్రసాద్ బాగా ఆలోచించుకొని కామెడీ అయితే బాగుటుంది అని కామెడీ సినిమాలు చేయడానికి సిద్దపడి మళ్లీ ఎన్టీయార్ ని కలిసినప్పుడు నేను కామెడీ సినిమాలు చేస్తాను అన్నయ్య అని చెప్పాడట. ఇక దాంతో సరే అని ఎన్టీయార్ రాజేద్రప్రసాద్ ని దీవించి పంపించాడు. అలా పెద్దాయన చెప్పిన మాట తో రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలు తీస్తూ దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీ లో కామెడీ ని పండిస్తూ నటకిరీటి అనే పేరు సంపాదించుకున్నాడు. అలా సీనియర్ ఎన్టీయార్ వల్లనే రాజేంద్రప్రసాద్ ఈరోజు ఇలా ఇక్కడ ఉన్నాడు.ఇక ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే హీరో గా ఆయన మార్కెట్ ముగియడం తో ప్రస్తుతం ఆయన వేరే హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. హీరోలకి తండ్రి గా, మామ గా నటిస్తూ ఆ పాత్రల్లో కూడా నవ్వులు పూయిస్తున్నాడు…