Samantha- Naga Chaitanya: పెళ్లి పెటాకులయ్యాక నాగ చైతన్య ఎక్కడా నోరు విప్పలేదు. “కట్టి పడేసే ప్రేమ కంటే స్వేచ్ఛను ఇచ్చే ప్రేమే గొప్పది” అని థ్యాంక్యూ సినిమాలో ఒక డైలాగు తప్ప..నాగ చైతన్య నోరు జారింది లేదు. కానీ సామ్ అలా కాదు. వీలు చికకినప్పుడల్లా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాట్లాడుతూనే ఉంది. ఈ మధ్య కూడా “కాఫీ విత్ కరణ్” లోనూ మాట్లాడింది. ఈసారి ఏకంగా డోస్ పెంచింది. కానీ ఎప్పటి లాగే నాగ చైతన్య నిశ్శబ్దంగానే ఉన్నాడు. ఇంతకీ సామ్ ఏం చెప్పింది? పెద్ద కుటుంబం, స్టూడియోలు గట్రా ఉన్న నేపథ్యం ఆమెకు ఎందుకు ప్రతి బంధకం అయింది? అక్కినేని కుటుంబంలో అమల లాగా ఎందుకు ఒదగలేకపోయింది?

నాగ చైతన్య సామే సర్వస్వం అనుకున్నాడు
చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తండ్రి వేరే మహిళను వివాహం ఆడాడు. అతడు తల్లి దగ్గరికి వెళ్లలేడు. అలాగని తండ్రి పట్టునా ఉండలేడు. చిన్నప్పటి నుంచే ప్రేమరాహిత్యం.. ఎవరిని నిందించాలో తెలియదు. ఇటు తల్లి కుటుంబం, అటు తండ్రి కుటుంబం పేరున్నవే. కానీ ఏం లాభం? ఇలాంటి స్థితిలోనే నాగచైతన్యకు సమంత పరిచయమైంది. ఎలాగూ కలిసి సినిమాలు చేశారు కాబట్టి ఆ చనువు ప్రేమకు దారి తీసింది. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాడు. సమంత సాంగత్యం కొత్తగా అనిపించింది. ఆమె మైకంలో మునిగిపోయాడు. సమంత తీరు తెలుసు కనుక నాగార్జున నో చెప్పాడు. అయినా చైతన్య వినిపించుకోలేదు. నాగార్జున దిగి వచ్చాడు. ఆమె చెప్పినట్టే క్రిస్టియన్ పద్దతిలో, నాగ చైతన్య కు ఇష్టమైన హిందూ విధానం లో పెళ్లి చేశాడు. కానీ మొదటి నుంచి సమంత సెటిల్డ్ క్యారెక్టర్. విహంగం టైపు, ఎక్కువ స్వేచ్చను కోరుకుంటుంది.
Also Read: Shamshera: స్టార్ హీరో సినిమాకి జనం లేక షోలు రద్దు.. ఇది ఇండస్ట్రీకే షాకింగ్ !
ఆమె చుట్టూ ఉన్న గ్యాంగ్ కూడా అలాంటిదే. పెళ్లి అయ్యాక కూడా సినిమాలు చేసింది. ఈ షరతు ముందే పెట్టింది. దీనికి నాగ్ కూడా నో చెప్పలేని పరిస్థితి. నాగ్ తో అమల పెళ్లి అయినప్పుడు ఆమె అక్కినేని కుటుంబ చట్రంలో ఒదిగింది. నాగ్, తను, అఖిల్ అంతే..మధ్యలో “పెటా” అనేది ఆమె వ్యాపకం.” లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” లాంటి చిత్రంలో నటించినా షరతులకు లోబడే . కానీ సమంత అలా కాదు. అలా అసలు ఉండలేదు. ఆమె ఒక నోటోరియస్. మోల్డ్ కాలేదు. ఆమె సర్కిల్ వేరు. ఈ ప్రశ్నలకి సమాధానాలు కష్టం.నాగ చైతన్య కోరుకున్న సమంత వేరు. సమంత ఆ పెద్ద కుటుంబ గోడల మధ్య బతక లేకపోయింది. ఆఫ్ కోర్స్ పెళ్లయ్యాక ఇష్టాలు, అభిరుచులు అన్ని వదులు కోవాలని లేదుగా. ఆ సోకాల్డ్ కట్టుబాట్లు ఆమెకు నచ్చ లేదు. నాకు నచ్చినట్టు బతుకు తాను అంటే కుదరలేదు. కట్టుబాట్లు కట్టి పడేసే సరికి ఊపిరి ఆడ లేదు. ఇన్ని జరుగుతున్నా ఆమె రాజీ పడలేదు. ఫలితంగా ఇద్దరి మధ్య ఘర్షణ.

గాఢత తక్కువ
ప్రేమలో ఉన్నన్ని రోజులు అన్ని బాగుంటాయి. వివాహం అయిన తర్వాత ఆ రోజులే భారంగా గడుస్తుంటాయి. ఇలాంటి ప్రేమలు సెలబ్రిటీ విషయాల్లో మరీ పెలుసు. గాఢత తక్కువ. అందువల్లే ఎక్కువ కాలం నిలబడవు. వాస్తవానికి సమంత ను అంచనా వేయడంలో నాగ చైతన్య ఫెయిల్. ఎందుకంటే సామ్ ఓ స్వేచ్ఛా విహంగం. దారం తో కట్టేస్తే ఉండే రకం కాదు. ఆమె జీవితంలో నాగ చైతన్య ఓ ఫాసింగ్ క్లౌడ్.”ఇద్దరిని ఓ ఒకే గదిలో ఉంచినప్పుడు పదునైన ఆయుధాలు లేక పోవడమే రెండు జీవితాలకు మేలు” అని సామ్ అనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవు. నాకేం తక్కువ అనే ఈగో. చాలా వరకు రాజీలు ఉండవు. ఇన్ని ఉన్నాకా ప్రేమ అని దానికి పేరు పెట్టడమే ఓ అబ్సర్డ్. ఇన్ని కట్టుబాట్లు, సో కాల్డ్ మర్యాదలు సామ్ కు నచ్చలేదు. కాబట్టే నాగ చైతన్య తో తెంచేసుకునేందుకే సిద్ధ పడింది. ఆ సమయంలో నాగ చైతన్య అలా మాన్ప్రడి పోయి చూస్తూ ఉన్నాడు. కొసాఖరికి విడిపోవడమే విడిపోవడమే జరిగింది. అక్కినేని, దగ్గుబాటి, నందమూరి, కొణిదెల కుటుంబాలు పరిశ్రమను ఏలుతూ ఉంటాయి. వైవాహిక బంధానికి వచ్చే సరికి సొసైటీ, మర్యాద మన్ను మశానం అన్ని లెక్కలోకి వస్తాయి. నాగ్ ను చేసుకున్న తర్వాత అమల మారిన తీరును సమంత అర్థం చేసుకోకపోవడం తప్పు. అలా ఉండలేను అని సామ్ అనుకుంటే నాగ చైతన్య ను పెళ్లి చేసుకోకుండా ఉండటమే కరెక్ట్.
కరణ్ షో లో ఏం మాట్లాడిందంటే..
తారల తెర వెనుక జీవితాలను వెలికి తీసే కరణ్ టాక్ షోలో సమంత మాట్లాడింది. నాగ చైతన్య పై ప్రత్యక్షంగా, పరోక్షంగా మాట్లాడింది. ₹250 కోట్ల పరిహారాన్ని తీసుకున్న విషయాన్ని ప్రస్తావించింది. ఎవడో ఏదో రాస్తే దానికి నాగ్, నాగ చైతన్య ఎలా బాధ్యులు? ఇప్పటికీ అక్కినేని కుటుంబం మౌనంగానే ఉంది. అదే కరెక్ట్ కూడా. పెళ్లి చేసుకున్నారు. విడిపోయారు. ఈ వ్యవహారంలో సామ్ పై ఎక్కడా కూడా నాగ చైతన్య విమర్శ చేయలేదు. కానీ సామ్ అలా కాదు. ఆమె ఓ డిఫరెంట్ క్యారెక్టర్. ఒక్కసారి విడిపోయాక ఇక వదిలేయాలి. తవ్వుతున్న కొద్దీ పెంకాసులు, మట్టి దిబ్బలు. సామ్ కు ఆ జ్ఞానం లేదు. వెనుక ఉండే గ్యాంగ్ పుషింగ్ అలాంటిది మరి. వాళ్ల వల్లే కదా బజారున పడింది. ముందే చెప్పినట్టు సామ్ గగనంలో ఎగిరే పతంగి. దారంతో నియంత్రించలేని విహంగి. సినీ తారల ప్రేమలు, పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో నాగ చైతన్య కు బోధ పడింది. కృతి శెట్టి, ఇంకా కొంత మంది పేర్లు మీడియా కొడయి కూసినా నాగ చైతన్య పల్లెత్తు మాట కూడా మాట్లడలేదు. మాట్లాడడు కూడా. అదే తన హుందాతనాన్ని మరింత పెంచుతుంది. కానీ సామ్.. సినీ వినీలాకాశంలో కొన్ని తారలు మెరుస్తాయి. తర్వాత కనుమరుగు అవుతాయి. సినీ పరిశ్రమ చాలా మంది సామ్ లను చూసింది.
Also Read:Getup Srinu- Edukondalu: జబర్ధస్త్ లొల్లి: ఏడుకొండలకు షాక్ ఇచ్చిన గెటప్ శ్రీను
[…] […]