Hareem Shah: పాకిస్తాన్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్ హరీమ్ షా అనగానే ఆమె టిక్ టాక్ స్టార్ కదా అని గుర్తు పట్టేస్తారు. ఆ రేంజ్ లో ఆమె బాగా పాపులారిటీ తెచ్చుకుంది. అయితే, ఆమె తన అందాన్ని మరింతగా పెంచుకుని పెద్ద స్టార్ అయిపోవాలని ఆశ పడి తన పెదాల ఆకృతిని మార్చుకోవడానికి లండన్ వెళ్లి మరీ.. అక్కడ సర్జరీ చేయించుకుంది. అయితే, సర్జరీ సగంలోనే వెనుదిరిగింది.
View this post on Instagram
దీంతో ఆమె పెదాలు ప్రస్తుతం ఉబ్బిపోయి వంకరగా కనిపిస్తున్నాయి. పైగా ఆమె లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ పాకిస్తాన్ టిక్‌టాక్ స్టార్ హరీమ్ షా.. తన లిప్ ఫిల్లర్ ట్రీట్‌మెంట్ గురించి చెబుతూ.. యూకేలో డాక్టర్‌ను కలిసిన ఆమె తన పెదవికి ఫిల్లర్ ట్రీట్‌మెంట్ ప్రారంభించిందట. అయితే, ఇంతలో ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.
Also Read: బడ్జెట్ ఎఫెక్ట్: ఈ వస్తువుల ధర పెరుగును.. వీటి ధర తగ్గును..!

పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమె బ్యాంక్ ఖాతాలను స్థంభింపజేసిందట. దాంతో చేసేది ఏమి లేక, ఎలాగూ ఈ సర్జరీ ఖరీదైనది కావడంతో ఇక ఆమె దాన్ని మధ్యలోనే వదిలేసి వచ్చేసింది. అయితే, ఇక్కడ ఆమె గురించి మరో వార్త కూడా బాగా వైరల్ అవుతుంది.
హరీమ్ షా పెద్ద మొత్తంలో నగదు తీసుకుని పాకిస్తాన్ నుంచి యూకేకు ప్రయాణించినందునే ఆమె పై మనీలాండరింగ్ విచారణ జరుపుతున్నట్లు ఎఫ్‌ఐఏ స్పష్టం చేస్తూ.. ఆమెదే తప్పు అని తేల్చి చెప్పింది. మొత్తమ్మీద ఎంతో అందంగా ఉండే ఆమె… చివరకు ఇలా అయిపోయింది.
Also Read: వీరాభిమాని కుమార్తె పెళ్లికి మెగాస్టార్ ఆర్థిక సాయం