Web Series Are Killing Movies: డిజిటల్ యుగంలో ఇప్పుడు అంతా వెబ్ సిరీస్ లదే ( Web Series) రాజ్యం అంటున్నారు. మరి వెబ్ సీరీస్ ల ప్రభావం తెలుగు సినిమా రంగం మీద ఎలా ఉండబోతుంది ? పోను పోను సినిమాల పై వెబ్ సిరీస్ లు ఎలా పై మెట్టు సాధిస్తాయి అని ఆలోచిస్తుంటే.. ఇక సినిమా తన గమ్యాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనిపిస్తోంది.
నిజానికి తెలుగు సినిమా పై ప్రభావం చూపే స్థాయి ఉన్న వెబ్ సిరీస్‌లు ఇంకా మనకి రాలేదు. అదే వేరే భాషల్లో అయితే, ఫ్యామిలీ మేన్, సేక్రెడ్ గేమ్స్ లాంటి విజయవంతమైన సిరీస్‌లు వచ్చాయి. ఇలాంటి సిరీస్ లు తెలుగులో కూడా వస్తే.. కచ్చితంగా భవిష్యత్తు సీరీస్‌లదే. పైగా సిరీస్ లకు ప్లాప్ అయినా మినిమమ్ గ్యారంటీ ఉంటుంది.
అన్నిటికీ మించి వెబ్ సిరీస్ లకు నిర్మాతలు ముందుగా డబ్బులు పెట్టాల్సిన పని కూడా లేదు. స్ట్రీమింగ్ సంస్థలే స్క్రిప్ట్ నచ్చితే బడ్జెట్ కేటాయిస్తాయి. దీని వల్ల నిర్మాతకు నష్టం వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో నిర్మాతలు సినిమా నిర్మాణం కంటే సిరీస్‌ల నిర్మాణానికె ఎక్కువ మొగ్గు చూపుతారు.
పైగా దర్శక రచయితలకు కూడా విస్తృతమైన, వైవిధ్యమైన కథలు చెప్పే అవకాశం సిరీస్‌ల ద్వారానే ఎక్కువ ఉంటుంది. కాబట్టి, దర్శక రచయితలు కూడా సిరీస్ ల పైనే ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇక రోజురోజుకు సిరీస్ లను చూసి ఇష్ట పడే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతూ పోతూ ఉంది.
థియేటర్ లో సినిమాలు చూసే వారి సంఖ్య కూడా తగ్గుతూ వస్తూ ఉంది. ఇంటి దగ్గరే నచ్చని కంటెంట్ ను చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల సినిమాలకు పరోక్షంగా కొంత నష్టం వాటిల్లుతుంది. అప్పుడు సినిమాలు తగ్గించి సిరీస్ లను నిర్మించడానికి మేకర్స్ ఉత్సాహం చూపిస్తారు.