Game Changer : నిర్మాత దిల్ రాజు తన ప్రతీ సినిమాని లిమిటెడ్ బడ్జెట్ లో తీస్తుంటాడు. ఎంత పెద్ద స్టార్ హీరో తో సినిమా చేసినా, ఆయన చాలా క్యాలికులేటెడ్ గా బడ్జెట్ ని ఖర్చు చేస్తాడు. కానీ మొట్టమొదటిసారి ఆయన డైరెక్టర్ ని హీరో ని నమ్మి డబ్బుని మంచి నీళ్లు లాగా ఖర్చు చేసిన చిత్రం ‘గేమ్ చేంజర్’. హీరో మీద నమ్మకం పెట్టినందుకు హీరో కష్టపడి పనిచేశాడు, ఆయన స్టార్ స్టేటస్ కారణంగా అత్యంత దారుణమైన షేర్స్ రాకుండా, మొదటి వారం లోపే వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. కానీ డైరెక్టర్ శంకర్ మాత్రం దిల్ రాజు నట్టేట ముంచేశాడు. అసలు 300 కోట్లు ఖర్చు చేయాల్సిన సబ్జెక్టు ఇది కాదు, పాటల కోసం పాపం అంత ఖర్చు చేయించడం అవసరమా..?, శంకర్ పైత్యం పరాకాష్టకు చేరుకుంది అంటూ ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు పెదవి విరిచారు.
పైగా శంకర్ కి ఒకప్పుడు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు లేదు. ‘గేమ్ చేంజర్’ కి ముందు ఆయన తీసిన కళాఖండం అలాంటిది మరి. సినిమాకి శంకర్ వల్ల క్రేజ్ రాకపోగా, నెగటివ్ హైప్ ఏర్పడింది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ట్రైలర్ కారణం గా సినిమా మీద కాస్త అంచనాలు పెరిగాయి. రెండు మూడు ఎలివేషన్ సన్నివేశాలు పెట్టినా రామ్ చరణ్ లాగేస్తాడని అభిమానులు అనుకున్నారు. కానీ సినిమాలో అలాంటి ఎలివేషన్ సన్నివేశాలు ఒక్కటి కూడా లేదు. ఇంటర్వెల్ ఒక్కటి పర్వాలేదు అనిపించింది. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి ఫలితాన్ని ఎదురుకుంది. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ సినిమా ఇంకా వంద కోట్ల రూపాయిల షేర్ ని అదనంగా రాబట్టాల్సిన అవసరం ఉంది. అది అసాధ్యం అని అనుకుంటున్న సమయం దిల్ రాజు ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఆదుకుంది.
విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ పాటల కారణంగా ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గుట్టుగానే విడుదల తర్వాత టాక్ రావడం, కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టడం జరిగింది. నేడు ఈ సినిమాకి సంబంధించి నిర్మాతలు సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత శిరీష్ మాట్లాడుతూ ‘ ఈ చిత్రం కచ్చితంగా విజయం సాదిస్తుందని బలమైన నమ్మకం ఉండేది కానీ, మూడు రోజుల్లో 100 కోట్లు కొట్టే రేంజ్ హిట్ అవుతుందని మాత్రం ఊహించలేదు. ఈ సంక్రాంతికి మాకు ఒక సమస్య వచ్చింది. విడుదలకు ముందు డైరెక్టర్ అనిల్ ఒక్కటే చెప్పాడు, ఈ చిత్రం మీ సమస్యలన్నీ తీర్చేస్తుంది సార్ అని. పైనుండి దేవతలు తధాస్తు అన్నట్టు ఉన్నారు. అదే జరిగింది. చాలామంది మేము పడిపోతే చూసి ఆనందిస్తుంటారు. మాకు వచ్చిన సమస్య వల్ల ఇండస్ట్రీ నుండి పారిపోతాం అనుకున్నారు, అలా జరగకుండా చేసాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి’ అంటూ ఆయన ఎమోషనల్ గా మాట్లాడాడు.
మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ సినిమా సాల్వ్ చేస్తాదని అనేవాడు అనిల్…
మేము బావిలో పడ్డాం అని చాలా మంది ఆనందపడే వాళ్ళు కానీ…
– శిరీష్#SankrantikiVasthunnam pic.twitter.com/JMI9VlYbLw
— M9 NEWS (@M9News_) January 17, 2025