Bigg Boss Telugu 8 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా రోహిణి, విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేట్ అవ్వగా, నేటి ఎపిసోడ్ లో విష్ణు ప్రియ ఎలిమినేట్ అవ్వబోతుంది. అయితే విష్ణు ప్రియ ఎలిమినేషన్ అవ్వడం పై అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం అవినాష్ ని సేవ్ చేయడం కోసమే విష్ణు ప్రియ ని ఎలిమినేట్ చేసారంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు సీజన్స్ లో ఫినాలే వీక్ లోకి టాప్ 6 కంటెస్టెంట్స్ అడుగుపెట్టేవారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఎవరికీ అయితే తక్కువ ఓటింగ్ వస్తుందో, వాళ్ళను బయటకి పంపేవారు. గత సీజన్ లో ఇది చేయలేదు కానీ, అంతకు ముందు సీజన్స్ లో ఇలాగే చేస్తూ వచ్చారు. కానీ ఈ సీజన్ లో చాలా తేలికగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ని పక్కన పెట్టేసారు.
ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడితే కచ్చితంగా విష్ణు ప్రియ కి అవినాష్ కంటే ఎక్కువ ఓటింగ్ వస్తుంది. అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడు అనే ఉద్దేశ్యంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా విష్ణు ప్రియ ని పంపేశారని, అవినాష్ ని ఫినాలే ఎపిసోడ్ లో చూపించడమే బిగ్ బాస్ లక్ష్యం అని అంటున్నారు. బాగా అలోచించి చూస్తే ఇది ముమ్మాటికీ నిజమే అని మనకి కూడా అనిపిస్తుంది. బిగ్ బాస్ చాలా తెలివిగా అన్యాయమైన ఎలిమినేషన్ చేసాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ బిగ్ బాస్ టీం పై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవినాష్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదు, హాట్ స్టార్ లో వచ్చే లైవ్ చాలా బోరింగ్ గా ఉంటుంది, అందుకే ఆయన్ని కాపాడేందుకు బిగ్ బాస్ టీం ఇంత ప్రయత్నం చేసిందని అంటున్నారు విశ్లేషకులు.
వాస్తవానికి అవినాష్ టాప్ 5 లో ఉండేందుకు విష్ణు ప్రియ తో పోలిస్తే అన్ని విధాలుగా అర్హుడు. ఎందుకంటే ఈ సీజన్ లో అవినాష్ ఇచ్చినంత కంటెంట్ ఏ కంటెస్టెంట్ కూడా ఇవ్వలేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ ని అందించడం మాత్రమే కాదు, టాస్కుల్లో కూడా ఆయన తన విశ్వరూపం చూపించాడు. ప్రతీ టాస్కులోను ఆయన గెలవడానికి ఆడాడు. ఆయన తన కష్టంతోనే రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాడు, తన ఆట తోనే ఫినాలే కి టికెట్ కూడా సంపాదించాడు. ఇలా ఏ విధంగా చూసిన ఆయన విష్ణుప్రియ కంటే బెస్ట్ కంటెస్టెంట్. కానీ మొదటి వారం నుండి లేకపోవడం వల్ల ఆడియన్స్ కనెక్షన్ తక్కువ ఉంది, అందుకే బిగ్ బాస్ అతన్ని ముందుకు నెడుతుంది, అందులో ఎలాంటి తప్పు లేదని కొంతమంది వాదన. అలోచించి చూస్తే వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా అని అనిపిస్తుంది.