Virupaksha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో తన స్టైల్ ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఈ ప్రాసెస్ లో సక్సెస్ లు వస్తుంటాయి. ఇక దానికి తగ్గట్టుగానే కొంతమందికి ఫెయిల్యూర్స్ కూడా వస్తున్నప్పటికీ అవన్నీ హీరోలు పడే కష్టం ముందు బోనస్ లాంటివి. ఒక సినిమా స్టోరీ బాగా ఉండి హీరో బాగా నటించగలిగితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.
హీరోకి కూడా మార్కెట్ లో మంచి పేరు వస్తుంది ఇక ఇలాంటి క్రమంలో ప్రతి హీరో తనకంటూ ఒక ఐడెంటిటి ఉండడం కోసం డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటాడు. ఒకప్పుడైతే అన్ని కమర్షియల్ సినిమాలు చేసి చాలామంది మంచి సక్సెస్ లను అందుకున్నారు.కానీ ఇప్పుడు అలా కాదు ఎంత కొత్తదనం ఉంటే అంతమంది ప్రేక్షకులు సినిమాలని ఆదరిస్తూ ఉంటారు.ఇక రీసెంట్ గా వచ్చిన విరూపాక్ష సినిమాని తీసుకుంటే ఆ సినిమా చాలా కొత్తగా ఉంటూ, చూసిన ప్రతి ప్రేక్షకుడికి చాలా అద్భుతంగా అనిపించింది దాంతో జనాలు ఆ సినిమాని హిట్ చేశారు. నిజానికి ప్రతి సినిమా కూడా ఏదో ఒక కొత్త అంశం తో తెరకెక్కుతుంటాయి తప్ప రోటీన్ సినిమాలు చేస్తే ఇక్కడ సక్సెస్ అనేది రాదు…
విరూపాక్ష సినిమా అనేది డిఫరెంట్ గా తెరకెక్కినప్పటికీ చాలా కొత్తగా సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది ఇక ఈ సినిమాకి డైరెక్టర్ కార్తీక్ దండు అయినప్పటికీ ఈ సినిమాలో ఉన్న మెయిన్ సీన్స్ కొన్నింటిని సుకుమార్ చేంజెస్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మెయిన్ గా క్యారెక్టర్ ని సాయి ధరమ్ తేజ్ వాళ్ళ అక్క అయిన శ్యామలకి ఇచ్చి ఆమె క్యారెక్టర్ చివర్లో విలన్ అనే రివిల్ చేద్దాం అని దర్శకుడు స్క్రిప్ట్ రాసుకున్నప్పటికీ సుకుమార్ దగ్గరికి వెళ్లిన తర్వాత ఆ స్టోరీ లో శ్యామల గారి పాత్ర కన్న హీరోయిన్ పాత్ర ని విలన్ గా పెట్టి స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. దాని వల్ల ఎమోషనల్ గా కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.దాంతో ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
అలా ఒక సినిమాకి స్క్రీన్ ప్లే అనేది ఎంత బాగా హెల్ప్ చేస్తుంది అనడానికి రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో విరూపాక్ష ఒక సూపర్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. విరూపాక్ష సినిమాలో విలన్ ఎవరు అనేది రివిల్ అవ్వడం వల్ల అప్పటికే హీరో, హీరోయిన్ ప్రేమించుకొని ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ అనేవి చివర్లో ప్రతి ఒక్కరిని అలరిస్థాయి అనే ఉద్దేశ్యం తో వాటిని పెట్టడం జరిగింది. అలా సుకుమార్ ఒక గొప్ప స్క్రీన్ ప్లే రాయడం వల్ల ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది…