Raj and Naga Chaitanya: కోయంబత్తూరు లోని ఇషా ఫౌండేషన్ లో నేడు ఉదయం సమంత(Samantha Ruth Prabhu), రాజ్ నిడిమోరు(Raj Nidimoru) పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే సమంత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చేసింది. వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గత కొంతకాలంగా సమంత, రాజ్ లు ప్రేమలో ఉన్నారు, వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ చిత్రం విడుదలకు ముందు తిరుమలకు వచ్చినప్పుడు ఆమెతో పాటు రాజ్ కూడా ఉండడం చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఇంతకాలం సోషల్ మీడియా లో వినిపిస్తున్నవి రూమర్స్ కావు, నిజమే అని అభిమానులు కూడా బలంగా నమ్మారు. అయితే ఎట్టకేలకు నేడు వీళ్లిద్దరు వివాహ బంధం లోకి అడుగుపెట్టడం తో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.
వీళ్లిద్దరి పరిచయం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా ఏర్పడింది. ఈ వెబ్ సిరీస్ లో సమంత విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆమెకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు ని కూడా తీసుకొచ్చింది ఈ చిత్రం. అయితే ఈ వెబ్ సిరీస్ కారణంగా సమంత, నాగ చైతన్య మధ్య అప్పట్లో విబేధాలు ఏర్పడ్డాయనే టాక్ ఆరోజుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఎందుకంటే సమంత ఇందులో కొన్ని ఇంటిమేట్ హాట్ సన్నివేశాల్లో కనిపిస్తుంది. అవి చూసేందుకు కాస్త ఇబ్బందిగా అనిపించే సన్నివేశాలే. ఇలాంటి సన్నివేశాల్లో సమంత ని చూపించినందుకు అప్పట్లో నాగ చైతన్య ఆ చిత్ర దర్శకుడిగా వ్యవహరించిన రాజ్ నిడిమోరు తో గొడవకు దిగాడట. ఈ విషయం తెలుసుకున్న సమంత కూడా నాగ చైతన్య తో విభేదించిందని, అలా వీళ్ళ మధ్య ఏర్పడిన మనస్పర్థలు అనేక అనుమానాలకు దారి తీసి విడాకులు తీసుకునే వరకు వెళ్లిందని టాలీవుడ్ లో అప్పట్లో ఒక రూమర్ సంచలనం రేపింది.
ఇప్పుడు వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం తో మరోసారి నెటిజెన్స్ ఈ పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, సమంత తో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే నాగ చైతన్య శోభిత తో కలిసి వరల్డ్ టూర్స్ వెయ్యడం, అదే విధంగా సమంత కూడా రాజ్ నిడిమోరు తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు అప్పట్లో రావడం, ఈరోజు ఈ రెండు వార్తలు నిజం అవ్వడం చూస్తుంటే, వాళ్లిద్దరూ విడాకులు తీసుకోవడం లో ఎవరిదీ తప్పు అనేది ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఏది ఏమైనా సమంత నేటి నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ రెండవ పెళ్లి తర్వాత ఆమె జీవితం లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి?, ఆమె కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం.