https://oktelugu.com/

Allu Arjun and Revanth Reddy : 2011 లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కి మధ్య ఒక ఇష్యూ జరిగిందా..?దానివల్లే అల్లు అర్జున్ మీద ఒత్తిడి తెస్తున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే ధోరణిలో చాలామంది చాలా రకాల ప్రశ్నలను వేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇరుక్కుంటుందని స్టార్ హీరోలు సైతం అందులో భాగమవ్వడం సినిమా ఇండస్ట్రీకి ఒక మాయని మచ్చలాగా మారుతుందని అంటున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : December 24, 2024 / 09:18 AM IST

    Allu Arjun , Revanth Reddy

    Follow us on

    Allu Arjun and Revanth Reddy : సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో పుష్ప 2 సినిమాతో మరోసారి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం పుష్ప 2 సినిమా విజయంతో యావత్ ఇండియా మొత్తం భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక దాంతోపాటుగా ‘బాహుబలి 2’ రికార్డును కూడా బ్రేక్ చేసే దిశగా ఆయన ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కేసలాటలో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ మీద ఏ11 గా కేసు ఫైల్ అయింది. ఇక చిక్కడపల్లి పోలీసులు అతన్ని అరెస్టు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇక ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన మీద సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద తీవ్రమైన కోపానికి వచ్చారనే విషయం మనందరికి తెలిసిందే. ఇక రీసెంట్ గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను ఎలాగైనా సరే అరెస్టు చేయాలని తనను దోషి అని నిరూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి ఎవరు చెప్పినా కూడా వినడం లేదట. కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డికి మధ్య ఇంతకుముందు ఒక విషయంలో కొంత వివాదం అయితే జరిగిందని దానివల్లే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద తీవ్రమైన కోపంతో ఉన్నాడంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇంతకీ వీళ్ళ మధ్య జరిగిన గొడవ ఏంటి అంటే 2011వ సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన సన్నిహితులు కొంతమంది సినిమా ప్రొడ్యూసర్ గా మారాలని అనుకున్నారట.

    ఇక అదే సమయంలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను కలిసి తన సన్నిహితులను ప్రొడ్యూసర్లుగా మారుతున్నారని చెప్పి మీతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారని చెప్పినప్పటికి అల్లు అర్జున్ మాత్రం రేవంత్ రెడ్డి మాటలను పెద్దగా పట్టించుకోలేదట. దానివల్లే రేవంత్ రెడ్డి ప్రస్తుతం అల్లు అర్జున్ మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడు అంటూ కొంతమంది కొన్ని వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం దీంట్లో రివెంజ్ తీర్చుకోవాల్సిందేమీ లేదు.

    ఒక నిండు ప్రాణం అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్ల పోయిందనే మనస్థాపంతోనే ఆయన ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తున్నారంటూ సామాన్యులకు కూడా న్యాయం కల్పించాలనే ఉద్దేశ్యం తోనే ఆయన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…