Nithin Thammudu flop: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయితేనే హీరోలకు క్రేజ్ పెరుగుతుంది. తద్వారా మరో రెండు, మూడు సినిమాల్లో నటించడానికి అవకాశం దొరుకుతుంది. ఇక తమకు అభిమానులు సైతం పెరుగుతారు. మార్కెట్ పరంగా చూసుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళుతున్న స్టార్ హీరోలందరు గొప్ప విజయాలను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ప్రస్తుతం నితిన్ లాంటి హీరో వరుస డిజాస్టర్స్ లను మూటగట్టుకుంటున్నాడు. గత సంవత్సరం తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ ను అందుకున్నాడు. ఇక తమ్ముడు సినిమా సమయంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దిల్ రాజుని ఇంటర్వ్యూ చేసిన నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ అవ్వకముందే నన్ను ఎలా ఎల్లమ్మ సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నారు అంటూ ఒక ప్రశ్న అయితే అడిగాడు. దానికి దిల్ రాజు సమాధానం చెబుతూ గతంలో ఇలాంటి సిచువేషన్ నాకు చాలా సందర్భాల్లో ఎదురయింది. ముఖ్యంగా హరీష్ శంకర్ డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడు హరీష్ శంకర్, పటాస్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక అదే సమయంలో అనిల్ తో సినిమా చేయడానికి నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.
ఇక ఆ సినిమాలో హీరో ఎవరు అనుకుంటున్నారు అనే ప్రశ్న తలెత్తినప్పుడు సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలోని ఒక సాంగ్ ని అనిల్ కు చూపించి ఇతనితో మనం సినిమా చేయబోతున్నాం. ఇంతకుముందు ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే సినిమా కూడా చేశాడు. అది మంచి సక్సెస్ సాధించిందని చెప్పాను.
దాంతో అనిల్ సైతం ఓకే చెప్పాడు. నేను అలా ఎందుకు చెప్పాను అంటే సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా బాగా వచ్చింది. ఆ సినిమా సక్సెస్ అవుతుందని నాకు తెలుసు. ఇక పటాస్ సినిమాతో సక్సెస్ ని సాధించిన అనిల్ రావిపూడి సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో సక్సెస్ ను సాధించబోతున్న సాయి ధరమ్ తేజ్ ఇద్దరిని కలిపి ఒక సినిమా చేస్తే ఆ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళిద్దరిని కలిపి ‘సుప్రీమ్’ సినిమా చేశాను.
ఇక ఇప్పుడు కూడా బలగం సినిమాతో సక్సెస్ ని సాధించిన వేణు, తమ్ముడు సినిమాతో సక్సెస్ సాధించబోతున్న నిన్ను ఇద్దరిని కలిపి ఎల్లమ్మ చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఆలోచించి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అంటూ ఆయన సమాధానం ఇచ్చాడు. మొత్తానికైతే తమ్ముడు సినిమా ఫ్లాప్ అవ్వడంతో దిల్ రాజు నితిన్ ను తీసి పక్కన పెట్టాడు అంటూ దిల్ రాజు మీద కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…