https://oktelugu.com/

Sa Re Ga Ma Pa: సరికొత్త స్వరాలతో సందడి చేయనున్న సరిగమప!

Sa Re Ga Ma Pa: బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు, ఎంటర్టైన్మెంట్ షోలు తెగ సందడి చేస్తున్నాయి. పైగా ప్రేక్షకులు కూడా బుల్లితెర షోలకు బాగా అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మరీ.. కొత్త కొత్త షోలు కొత్త కొత్త ఎంటర్టైన్మెంట్ లతో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని రియాలిటీ షోలు మాత్రం కొందరికి కొత్త జీవితాలను ఇస్తున్నాయి. Also Read: ఆ ప్రాంతాల్లో కూడా స్టూడియోలు క‌ట్టాలంట‌.. జ‌గ‌న్ పెద్ద […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 19, 2022 / 12:27 PM IST
    Follow us on

    Sa Re Ga Ma Pa: బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు, ఎంటర్టైన్మెంట్ షోలు తెగ సందడి చేస్తున్నాయి. పైగా ప్రేక్షకులు కూడా బుల్లితెర షోలకు బాగా అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మరీ.. కొత్త కొత్త షోలు కొత్త కొత్త ఎంటర్టైన్మెంట్ లతో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని రియాలిటీ షోలు మాత్రం కొందరికి కొత్త జీవితాలను ఇస్తున్నాయి.

    Sa Re Ga Ma Pa

    Also Read: ఆ ప్రాంతాల్లో కూడా స్టూడియోలు క‌ట్టాలంట‌.. జ‌గ‌న్ పెద్ద ప్లానే వేశారే..!

    అలా ఇప్పటికీ చాలా షోలు ప్రసారం కాగా త్వరలోనే జీ తెలుగులో సరిగమప అనే మరో సింగింగ్ రియాల్టీ షో కూడా సరికొత్త స్వరాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో యాంకర్ శ్రీముఖి తన మాటలతో మరోసారి ఫిదా చేయడానికి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇందులో జడ్జెస్ గా కోటి, స్మిత, అనంత శ్రీరామ్, ఎస్.పి.శైలజ లు పాల్గొన్నారు.

     

    అంతేకాకుండా మెంటర్స్ గా ప్రముఖ సింగర్స్ గీతా మాధురి, శ్రీకృష్ణ, రేవంత్, సాకేత్ లు ఎంట్రీ ఇచ్చారు. ఇక కొత్త సింగర్స్ పరిచయం కాగా వాళ్లంతా తమ తొలి పాటలతోనే అద్భుతంగా మెప్పించారు. ఇందులో శ్రీముఖి అందించే ఎంటర్టైన్మెంట్ మాత్రం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. పైగా సింగర్స్ ల ఎమోషన్స్ కూడా కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి. ఈ షో కేవలం పాటలకే కాకుండా సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో, ఎమోషన్స్ తో ముందుకు రానుందని తెలుస్తోంది. ఇక ఈ షో ఫిబ్రవరి 20న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రారంభం కానుంది.

     

    అయితే ఇప్పటికే జీ తెలుగులో సరిగమప సింగింగ్ కార్యక్రమం ప్రసారం అయి ప్రేక్షకులను ఎంతగానో సందడి చేయడమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది సింగర్ లను పరిచయం చేసింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తిరిగి ఈ కార్యక్రమం మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి రాబోతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ ప్రోమోలో కొత్త సింగర్లు మొదటి పాటతోనే ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.

     

    ఈ ప్రోమో ద్వారా నైపుణ్యం ఉంటే చాలు ఎక్కడైనా ఎలాగైనా సాధిస్తారనే విషయాన్ని ఈ సింగర్లు నిరూపించారు.ఇక తమలో ఇలాంటి నైపుణ్యం పెట్టుకొని ఇప్పటివరకు ఈ వేదికపైకి చేరుకోలేక పోవడానికి కారణాలు తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చినందుకు కంటెస్టెంట్స్ వేదికపై ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఒక్కొక్కరు తమ అద్భుతమైన గాత్రంతో పాటలను పాడుతూ ప్రతి ఒక్కరిని ఎమోషనల్ గా టచ్ చేశారని చెప్పవచ్చు.ఇక కొందరు పాడిన పాటలకు ఈ వేదికపైకి చేరుకోవడానికి పడిన కష్టాలను తెలియజేయడంతో పలువురి జడ్జెస్, మెంటర్స్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.

     

    కేవలం మొదటి ప్రోమోతోనే ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ కార్యక్రమం పై అంచనాలు పెరిగేలా చేసింది.ఇక ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని అలాగే చిత్ర పరిశ్రమకు ఎంతో నైపుణ్యం గల గాయనీ గాయకులు దొరుకుతారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలను పెంచుతుంది..

    Also Read: జ‌గ్గారెడ్డి రాజీనామాను ఆమోదిస్తుందా? అడ్డుకుంటుందా?

    Recommended Video: