War2 JrNTR Remuneration: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2 ‘(War 2 Movie) చిత్రం వచ్చే నెల 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నిన్న విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మాత్రం ఉంటే చాలు, మన తెలుగు లో కూడా పెద్ద హిట్ అయిపోతుంది అని అనుకున్నారు ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంత పెద్ద సూపర్ స్టారో, హృతిక్ రోషన్ బాలీవుడ్ లో అంత పెద్ద సూపర్ స్టార్. ఆయన సినిమాలు ఒకప్పుడు మన టాలీవుడ్ లో కూడా బాగానే ఆడేవి. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ ని నెలకొల్పుతుందో చూడాలి.
అయితే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ రెమ్యూనరేషన్స్ ఎంత తీసుకున్నారు అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ కి హృతిక్ రోషన్ మీద కాస్త ఎక్కువ మార్కెట్ ఉంది. ఎందుకంటే ఆయన సినిమాలు తెలుగు లో హిట్ అయితే రికార్డు స్థాయి వసూళ్లు వస్తాయి. అదే విధంగా #RRR కారణంగా నార్త్ ఇండియా లో ఎన్టీఆర్ కాస్త బాగా సుపరిచితమయ్యాడు. సినిమా బాగుందంటే ఆయనకు కూడా నార్త్ ఇండియా లో భారీ వసూళ్లు వస్తాయి. కాబట్టి ఎన్టీఆర్ కి కాస్త పెద్ద మార్కెట్ ఉండడంతో ఈ చిత్రానికి ఆయన 60 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. అదే విధంగా హృతిక్ రోషన్ 45 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు సమాచారం. వీళ్లిద్దరు కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ 32 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని అందుకున్నాడట.
ఒక డైరెక్టర్ బాలీవుడ్ లో ఇంత రెమ్యూనరేషన్ ని అందుకోవడం సాధారణమైన విషయం కాదు. ఇక హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ కూడా 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుందట. ఈమె ట్రైలర్ లో హృతిక్ రోషన్ తో కలిసి రొమాన్స్ చేసింది, మళ్ళీ ఆయనతోనే ఫైటింగ్ కూడా చేస్తుంది, ఏంటో ఈమె క్యారక్టర్, పాజిటివ్ లేదా నెగటివ్ అనేది అర్థం కావడం లేదు కానీ, ఆమెకు కూడా సినిమాలో చాలా బలమైన క్యారక్టర్ పడినట్టు గా అనిపిస్తుంది. ఇలా ఈ నలుగురి రెమ్యూనరేషన్స్ కలిపితే దాదాపుగా 150 రూపాయలకు పైగా బడ్జెట్ అవుతుంది. అంటే సినిమా మొత్తానికి ఎంత బడ్జెట్ అవుతుందో మీరే ఊహించుకోవచ్చు.