War 2 Box Office Gross: మరికొద్ది గంటల్లో ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ కి సంబంధించి ఏ సినిమా విడుదలైన అభిమానులు ఎలా సెలెబ్రేట్ చేస్తారో మనమంతా ఇన్నేళ్లు చూస్తూనే ఉన్నాం. కానీ ఎందుకో ‘వార్ 2’ చిత్రాన్ని ఎన్టీఆర్ అభిమానులు సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించడం లేదు. ఇందులో ఎన్టీఆర్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేసాడు అనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. బహుశా అందువల్లే అభిమానులు ఈ చిత్రాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు లేరు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. రేపు ఈ చిత్రం తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: ప్యారడైజ్ సినిమాలో నాని చనిపోతాడా..? ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..?
ఈ చిత్రానికి అనకాపల్లి నుండి అమెరికా వరకు ఎటు చూసినా మెంటలెక్కిపోయే రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ‘వార్ 2’ అయితే ఆ చిత్రానికి దగ్గర్లో కూడా లేకపోవడం గమనార్హం. ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి ప్రాంతాలు రజినీకాంత్ కి కంచు కోట లాంటివి. అక్కడ ఆయన సినిమా డామినేషన్ ఉండడం సర్వసాధారణం, కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం డామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే ఎన్టీఆర్ కి కంచుకోట లాంటి ప్రాంతమైన సీడెడ్ లో కూడా కూలీ చిత్రానిదే పై చెయ్యి అట. ఇదంతా పక్కన పెడితే హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టార్ హీరోల కొత్త సినిమాల విడుదల సమయం లో టికెట్స్ దొరికితే అదృష్టం అని అనుకోవాలి. అలాంటి క్రేజీ సెంటర్ లో కూడా అన్ని థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కనీసం రీ రిలీజ్ చిత్రాలకు వచ్చిన గ్రాస్ వసూళ్లు కూడా ఈ చిత్రానికి వచ్చేలా కనిపించడం లేదు.
Also Read: ‘కూలీ ‘ మూవీ యూఎస్ఏ రివ్యూ…
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’, మహేష్ బాబు ‘ఖలేజా’, ‘మురారి’ వంటి చిత్రాలు మొదటి రోజు 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించాయి. ‘వార్ 2’ చిత్రం ప్రస్తుత ట్రెండ్ ని బట్టీ చూస్తే 40 లక్షల దగ్గరే ఆగిపోయేట్టుగా కనిపిస్తుంది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కాస్త అవమానకరమైన విషయం అనే చెప్పాలి. ఎంతైనా డబ్బింగ్ సినిమాకు , స్ట్రెయిట్ తెలుగు సినిమాకు చాలా తేడా ఉంది. ‘వార్ 2’ డబ్బింగ్ చిత్రం గానే ప్రచారం అయ్యింది. అందుకే ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. బుకింగ్స్ ఎలా ఉన్నా సరే, రేపు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల వరకు థియేటర్స్ జాతర ని తలపిస్తాయి, ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం దారుణమైన పరాభవాన్ని ఎదురుకోవాల్సి వస్తుంది.