Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Collections Report: 'వార్ 2'..'ఉస్తాద్ భగత్ సింగ్'..పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లకు...

Ustaad Bhagat Singh Collections Report: ‘వార్ 2′..’ఉస్తాద్ భగత్ సింగ్’..పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లకు డేంజర్ బెల్స్ లాంటివి..

Ustaad Bhagat Singh Collections Report: బాలీవుడ్ లాగానే, టాలీవుడ్ లో కూడా స్టార్ డమ్ మీద నడిచే సినిమాలకు కాలం చెల్లినట్టేనా?, కేవలం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ఆడుతాయా..?, ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు, కంటెంట్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ తోనే భారీ వసూళ్లు స్టార్ హీరోలకు నమోదు అయ్యేవి. అంతే కాదు , కాస్త యావరేజ్ రేంజ్ లో ఉన్నా సూపర్ హిట్స్ అయిపోయేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అసలు కనిపించడం లేదు. అందుకు రీసెంట్ ఉదాహరణలు గత ఏడాది విడుదలైన ఎన్టీఆర్(Junior NTR) ‘వార్ 2’, రెండు వారల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రాలే. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోలు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్. ఓపెనింగ్స్ అంటే మన అందరికీ గుర్తుకువచ్చే పేర్లు వీళ్ళిద్దరివే. వీళ్ళ గత చిత్రాలు ఓజీ, దేవర ఓపెనింగ్స్ విషయంలో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి.

రెండు చిత్రాలు కూడా మొదటి రోజే 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. అలాంటి సినిమాలు తర్వాత వీళ్లిద్దరు చేసిన ‘వార్ 2’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు వాళ్ళ పరువు కి భంగం కలిగించాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అయితే కనీసం 100 కోట్ల గ్రాస్ ని ఫుల్ రన్ లో రాబట్టింది. కానీ ‘వార్ 2’ చిత్రం కనీసం 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా క్లోజింగ్ లో రాబట్టలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనిని డబ్బింగ్ సినిమా గా పరిగణించి, ఇది ఎన్టీఆర్ సినిమా కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఆ హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. పైగా ఇది వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టగల సత్తా ఉన్న సినిమా.

స్పై జానర్ లో సంచలనం సృష్టించిన ‘వార్’ లాంటి భారీ హిట్ కి సీక్వెల్, అంత పెద్ద సినిమాకు కనీసం తెలుగు వెర్షన్ నుండి 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాకపోవడం దురదృష్టకరం. దీనిని బట్టీ చూస్తుంటే ఆడియన్స్ లో నిజమైన ఆసక్తి ని కలిగించలేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా చూసేది లేదు అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా , రీమేక్ అనే ప్రచారం వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పై అభిమానులే పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ సినిమాలు రాబట్టినంత వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. ‘అజ్ఞాత వాసి’ కంటే తక్కువ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇవి ఈ ఇద్దరి హీరోలకు డేంజర్ బెల్స్ లాంటివి, భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు చేస్తే చాలా ప్రమాదం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version