Shyamala Devi Comments On Prabhas Wedding: ఇండియా లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే మన అందరికీ ముందు సల్మాన్ ఖాన్(Salman Khan) గుర్తుకు వస్తాడు, ఆ తర్వాత వెంటనే ప్రభాస్(Rebel Star Prabhas) గుర్తుకొస్తాడు. నాలుగు పదుల వయస్సు దాటినప్పటికీ కూడా ప్రభాస్ ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడం ఆయన అభిమానులకు కాస్త నిరాశకు గురి చేసే విషయం. పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రభాస్ ఎన్నో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ నెలకొల్పాడు. భవిష్యత్తులో ఆయన ఇంకా ఎన్నో సంచలనాత్మక రికార్డ్స్ ని నెలకొల్పుతాడు. కానీ అభిమానుల్లో ఈ చిన్న అసంతృప్తి మాత్రం ఉంది. కృష్ణంరాజు గారిని గతం లో మీడియా ముందు ఎప్పుడు వచ్చినా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అడిగేవారు. ఇప్పుడు ఆయన సతీమణి శ్యామల దేవి గారిని అడుగుతున్నారు. రీసెంట్ గానే ద్రాక్షారామం కి విచ్చేసిన ఆమెని మీడియా రిపోర్టర్స్ ప్రభాస్ పెళ్లి గురించి అడగా ఆమె చెప్పిన సమాధానం బాగా వైరల్ అయ్యింది. ఇంతకీ ఆమె ఏమి మాట్లాడిందో చూద్దాం.
Also Read: రచ్చ రంబోలా.. నాని ప్యారడైజ్ తో ఏదో చేసేలా ఉన్నాడే..!
ఆమె మాట్లాడుతూ ‘ద్రాక్షారామం నరసింహ స్వామి వారి దర్శనాన్ని నేను, కృష్ణం రాజు గారు ఎన్నో సార్లు చేసుకున్నాము. కృష్ణంరాజు గారికి ఆ స్వామి అంటే ఎంతో ఇష్టం. ఈ ప్రాంతం నుండే ఆయన మొట్టమొదటిసారి ఎంపీ గా కూడా గెలుపొందాడు. ఎప్పుడు కాకినాడ కి వచ్చిన ద్రాక్షారామం కి రావడం, దర్శనం చేసుకోవడం నాకు అలవాటు. ద్రాక్షారామం దర్శనం కోసం వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. కృష్ణం రాజు గారితో చివరిసారిగా ఇక్కడికి వచ్చాను. రీసెంట్ గానే వెళ్లాలని అనుకుంటూ ఉన్నాను, ఇంతలోపే కాకినాడ లో ఒక కార్యక్రమం కోసం రావడం, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. భగవంతుడు నాకు అలా పిలుపుని ఇచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చింది.
రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘ప్రభాస్ గారి గురించి ఏమని కోరుకున్నారు’ అని అడగ్గా, దానికి శ్యామల దేవి నవ్వుతూ సమాధానం చెప్తూ ‘అది మీ అందరికీ తెలిసిందే. బాబు కి సాధ్యమైత తొందరగా పెళ్లి చెయ్యాలని పార్వతి పరమేశ్వరులను కోరుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సంవత్సరం ప్రభాస్ పెళ్లి చేస్తారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్న కి శ్యామల దేవి స్పందిస్తూ ‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా, భగవంతుడి ఆజ్ఞ..ఆయన ఎప్పుడు ఏ రోజు జరగాలని అనుకుంటాడో అప్పుడే జరుగుతుంది, మిస్ అవ్వదు, తప్పకుండా ఆ శుభ సమయం వచ్చేస్తుంది. పైగా మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్లకి కూడా మంచి సంబంధాలు చూస్తున్నాము.’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రభాస్ కి మీ కుటుంబం లోనే సంబంధం చూస్తున్నారా? లేదా సినీ పరిశ్రమకు చెందినవాళ్లనే చూస్తున్నారా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ‘అది నాకు తెలియదు. పెళ్లి మాత్రం అతి త్వరలోనే జరుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది శ్యామల దేవి.
ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభాస్‌కు తప్పకుండా పెళ్లి చేయాలనుందని తెలిపిన శ్యామలాదేవి
శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే పెళ్లి జరుగుతుందని వెల్లడి pic.twitter.com/JL1AuIAjTS
— BIG TV Breaking News (@bigtvtelugu) August 11, 2025