Coolie War 2 Overseas Review: మరో రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఇంతకు ముందు ఎప్పుడూ జరగని ఆసక్తికరమైన పోరు జరగనుంది. సాధారణంగా సంక్రాంతి, లేదా దసరా సీజన్ లో రెండు మూడు సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి ఆగష్టు 14 లాంటి డేట్ లో రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి ‘వార్ 2′(War 2 Movie) కాగా,మరొకటి ‘కూలీ'(Coolie Movie). ఈ రెండు చిత్రాల్లో రజినీకాంత్((Superstar Rajinikanth) కూలీ కి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించడమే ఆలస్యం, ప్రతీ ప్రాంతం లోనూ టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే టికెట్స్ అసలు దొరకడం లేదు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ మార్కుని దాటింది. ఇది సాధారణమైన విషయం కాదు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన బుకింగ్స్ కూడా పూర్తి స్థాయిలో మొదలైతే కేవలం బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు నెటిజెన్స్.
Also Read: ఈసారి మిస్ అవ్వదు..ప్రభాస్ పెళ్లి పై పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు!
ఇక ‘వార్ 2’ విషయానికి వస్తే ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) నుండి అభిమానులు భారీ ప్రొమోషన్స్ ని ఆశించి దెబ్బతిన్నారు. కేవలం ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది. ఇది ఎన్టీఆర్ రేంజ్ కి దారుణమైన బుకింగ్స్ అనుకోవాలి. ఇది కాసేపు పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రివ్యూ రిపోర్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిపోయాయి. ముందుగా ‘వార్ 2’ రివ్యూ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఇది ఒక యావరేజ్ సినిమా అంటున్నారు.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాల కోసం ఎంత టికెట్ రేట్ అయినా పెట్టే విధంగా ఉంటుంది, డైరెక్టర్ అయాన్ ఆ రేంజ్ లో ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ‘వార్ 2’ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయిందట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్ రేంజ్ లో ఉందట. ఓవరాల్ గా ఈ సినిమాకు కూడా యావరేజ్ రిపోర్ట్స్ నడుస్తున్నాయి. రెండు సినిమాలు యావరేజ్ రేంజ్ లోనే ఉన్నాయి, ‘వార్ 2’ రిపోర్ట్స్ కాస్త బెటర్ గా ఉన్నాయి అంటూ సోషల్ మీడియా లో ఓవర్సీస్ రిపోర్ట్స్ గురించి వినిపిస్తున్న మాట. మరి ఆడియన్స్ నుండి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందా?, లేడంటే వేరేలా వస్తుందా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఓపిక పట్టక తప్పదు.