Luxury Lifestyle : ఉద్యోగం వ్యాపారం చేసే చాలామంది తమ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని అనుకుంటారు. ఇందుకోసం తీవ్రంగా కష్టపడతారు. అయితే డబ్బు పొదుపు చేయడంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు. కొంతమంది డబ్బు బాగా సంపాదించిన దానిని నిల్వ చేయకుండా వృథా ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీంతో వారు ఎంత సంపాదించినా తృప్తిగా ఉండలేరు. అయితే ప్రణాళిక ప్రకారంగా డబ్బులు పొదుపు చేయడం వల్ల ప్రస్తుతం తో పాటు భవిష్యత్తులో జీవితం బాగుంటుంది. ఇటీవల ఇటీవల మార్కెట్ నిపుణుడు అభిజిత్ చొక్సీ తెలిపిన వివరాల ప్రకారం కొందరు తమ చేతిలో డబ్బు లేకుండా స్థాయికి మించి ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నాడు. వీరిలో ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉన్నారని అంటున్నారు. ఆయన చెప్పిన వివరాల్లోకి పరిశీలిస్తే..
Also Read : రేషన్ కార్డు కలిగి 18 ఏళ్లు నిండిన వారందరికీ గోల్డెన్ ఛాన్స్.. ఉచితంగా పొందొచ్చు..
సాధారణంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ తమకు వచ్చే ఆదాయంలో 50% సొంత అవసరాలకు ఖర్చు పెడుతూ ఉంటారు. మిగతా వాటిలో 25 శాతం పొదుపు మరో 25% ఇతర ఖర్చులను చేసుకుంటూ ఉంటారు. ఇలా డబ్బు పొదుపు చేసి చివరికి ఇల్లు లేదా పిల్లల స్కూల్ ఫీజులకు ఖర్చులు చేస్తూ ఉంటారు.
అయితే అభిజిత్ చొక్సీ తెలిపిన వివరాల ప్రకారం మిడిల్ క్లాస్ పీపుల్స్ 75% లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వారికి ఈ వస్తువుల వల్ల తాత్కాలికంగా మాత్రమే ఆనందంగా ఉంటుందని అయితే ఆ తర్వాత ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చాలామంది రిచ్ పీపుల్స్ తో పోల్చుకొని తాము కూడా రిచ్ గా కనిపించాలని స్థాయికి మించి ఎక్కువ ధరకు ఉండే వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఈ వస్తువుల కోసం అప్పులు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇందులో భాగంగా క్రెడిట్ కార్డు ఉన్నవారు లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
అయితే వీటిని తిరిగి చెల్లించడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలా విలాస వస్తువులు కొనుగోలు చేసి ఆ తర్వాత ఇబ్బంది పడినవారు ఎంతోమంది ఉన్నారు. కొందరు మితిమీరిన అప్పులు చేసి ఆ తర్వాత వాటిని తీర్చలేక కొట్టుమిట్టాడుతున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ తమకు వచ్చిన ఆదాయంలో కొంత మాత్రమే ఖర్చు పెట్టి మిగతాది ఎక్కువగా పొదుపు చేయడానికి ఆసక్తి చూపాలే. అలా చేయని పక్షంలో జీవితం చిన్నా భిన్నంగా రుతుంది.
మరికొందరు రిచ్ పీపుల్స్ తో పోల్చుకొని వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. గతంలో తక్కువ రేటు మద్యం కొనుగోలు చేసేవారు ఇప్పుడు ఎక్కువ ధర కలిగిన వాటిని కొనుగోలు చేస్తూ డబ్బులు ఎక్కువగా వృధా చేసుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో వారి జీవిత భాగస్వాములు లేదా ఇతరులు గమనించి వెంటనే వారిని మార్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంట్లోకి వచ్చే ఆదాయంలో సగం ఇలాంటి వాటికే వెళుతుంటుంది. అంతేకాకుండా విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే ముందు జీవిత భాగస్వామితో చర్చించాలి. అది ఎంత అవసరమో గ్రహించిన తర్వాతే దాని కొనుగోలుకు ముందుకు సాగాలి.