NTR Aamir Khan : బాలీవుడ్ హీరోలు మన సౌత్ ఇండియా లో మార్కెట్ ని పెంచుకోవడానికి ఎన్నో ఏళ్ళ నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మల్టీ స్టార్రర్ చిత్రాలను చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో, టాలీవుడ్ స్టార్ హీరో కలిస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ‘వార్ 2′(War 2 Movie) చిత్రం తెరకెక్కింది. హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి ఎన్టీఆర్ చేసిన ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈ సినిమాతో ఎన్టీఆర్(Junior NTR) కచ్చితంగా సౌత్ మార్కెట్ లో ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా నార్త్ ఇండియా లో హృతిక్ రోషన్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read : డ్యూడ్’ స్టోరీ లైన్ ఇంత వెరైటీ గా ఉందేంటి..ప్రదీప్ రంగనాథన్ మరో హిట్ కొట్టినట్టే!
ఆయన యాక్షన్ చిత్రాలకు భారీ స్థాయిలో గ్రాస్ వసూళ్లు వస్తుంటాయి. ఖాన్స్ కూడా హృతిక్ రోషన్ స్టామినా ముందు నిలబడలేరు. అలాంటి స్టామినా ఆయన సొంతం. వీళ్లిద్దరు కలిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది?, బాలీవుడ్ హీరోలు సౌత్ లో విస్తరించాలని వేసిన ప్లాన్ లో సక్సెస్ అవుతారా లేదా అనేది తెలియాలంటే ఆగస్టు 14 వరకు వేచి చూడాల్సిందే. అయితే హృతిక్ రోషన్ కంటే ముందు, అమీర్ ఖాన్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాలో నటించాలని అనుకున్నాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?..అమీర్ ఖాన్(Amir Khan) గురి చూసి కొడితే ఎలాంటి టార్గెట్ అయినా పడాల్సిందే. సౌత్ లో ఎలా అయినా పాగా వెయ్యాలి అనే కసితో ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి గట్టి ప్రయత్నమే చేశాడు. ఆ సినిమా మరేదో కాదు ‘లాల్ సింగ్ చద్దా’. 2022 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది.
ఈ చిత్రం లో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ నాగ చైతన్యకు మంచి ఎమోషనల్ క్యారక్టర్ పడింది అనే టాక్ అప్పట్లో వచ్చింది. అయితే ఈ క్యారక్టర్ ని ముందుగా ఎన్టీఆర్ తో చేయించాలని అమీర్ ఖాన్ అనుకున్నాడు. స్వయంగా ఆయనే ఈ విషయం లో ఎన్టీఆర్ ని సంప్రదించాడు. అయితే ఎన్టీఆర్ దానికి స్పందిస్తూ మీలాంటి మహానటుడితో కలిసి నటించే అవకాశం రావడం నాకు అదృష్టమే, కానీ నాకు తగ్గ పాత్ర ఇది కాదండి, దయచేసి ఏమి అనుకోకండి ఈ చిత్రం నేను చేయలేనని చెప్పాడట. ఆ తర్వాత ఆమీర్ ఖాన్ నాగ చైతన్య వద్దకు వెళ్ళాడు. ఆయన వెంటనే ఒప్పుకొని ఈ సినిమా చేశాడు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ కి చేరువ చెయ్యడానికి అమీర్ ఖాన్ ఎంత కష్టపడ్డాడో మన అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తో స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసాడు, అయినప్పటికీ వర్కౌట్ అవ్వలేదు.