War 2 Collection: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని , ఎన్టీఆర్ అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిలించిన సంగతి తెలిసిందే. రభస చిత్రం తర్వాత ఎన్టీఆర్ చూసిన మొట్టమొదటి ఫ్లాప్ ఇది. ఆ చిత్రం తర్వాత తెరకెక్కిన ‘టెంపర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘ఇక నుండి అభిమానులు కాలర్ ఎగరేసే సినిమాలను మాత్రమే చేస్తాను’ అంటూ మాట ఇచ్చాడు ఎన్టీఆర్. ఇచ్చిన మాట ప్రకారం ‘దేవర’ చిత్రం వరకు ఎన్టీఆర్ తన అభిమానులను ఎత్తిన కాలర్ ని దించేలా చేయలేదు. వరుసగా 7 బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఇక ఎన్టీఆర్ కి జీవితం లో ఫ్లాప్ చూడలేం ఏమో అని అనుకుంటున్నా సమయం లో ‘వార్ 2’ చిత్రం రూపం లో ఆయన కెరీర్ లో కనీవినీ ఎరుగని రేంజ్ ఫ్లాప్ వచ్చింది.
Also Read: ప్యారడైజ్ తేడా కొడితే శ్రీకాంత్ తో చిరంజీవి సినిమా చేస్తాడా..?
ఎన్టీఆర్ చిత్రానికి టాక్ తో సంబంధం లేదు, భారీ ఓపెనింగ్ వసూళ్లు వస్తుంటాయి. ఆయన కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ అని చెప్పుకునే రభస చిత్రానికి కూడా టాప్ 3 ఓపెనింగ్ వచ్చింది. కానీ ‘వార్ 2’ కి మాత్రం ఓపెనింగ్స్ దగ్గర నుండే ఘోరమైన పరాభవం మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి కనీసం 12 కోట్ల రూపాయిల వర్త్ షేర్ కూడా రాలేదు. దీంతో GST లు, హైర్స్ కలిపి 17 కోట్ల రూపాయిల షేర్ ని మొదటి రోజు వేయించారు. ఇక రెండవ రోజు పబ్లిక్ హాలిడే అవ్వడం తో GST తో కలిపి తెలుగు రాష్ట్రాల నుండి 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. కానీ మూడవ రోజు మాత్రం తెలుగు వెర్షన్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజు 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది.
ఓవరాల్ గా తెలుగు వెర్షన్ మూడు రోజులకు కలిపి 31 కోట్ల రూపాయిలు వచ్చాయి. నేడు ఇంకా తక్కువ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయం లో ఈ చిత్రానికి హిందీ వెర్షన్ బాగా సహాయపడింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి హిందీ వెర్షన్ నుండి 160 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా హిందీ + తెలుగు వెర్షన్ కలిపి మూడు రోజులకు 217 కోట్ల రూపాయిల గ్రాస్ వరల్డ్ వైడ్ గా వచ్చింది. నేడు కూడా హిందీ వెర్షన్ నుండి డీసెంట్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. రేపటి నుండి కనీస స్థాయిలో అయినా హిందీ వెర్షన్ హోల్డ్ చేసుకోగలిగితే ఈ చిత్రం క్లోజింగ్ లో 350 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకునే అవకాశం ఉంది.