Waltair Veerayya Two Weeks Collection: మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ జోరు ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు..ఈమధ్య కాలం లో వీకెండ్స్ మరియు సెలవు దినాల్లో కాకుండా , వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘వాల్తేరు వీరయ్య’ అనే చెప్పాలి..గడిచిన కొద్ది సంవత్సరాలలో #RRR చిత్రానికి తప్ప ఈ స్థాయి వసూళ్లు మరో సినిమాకి రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..మొదటి వారం లో 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం..రెండవ వారం లో పాతిక కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది..చాలా మంది నేటి తరం స్టార్ హీరోలకు కూడా ఈ స్థాయి వసూళ్లు ఇప్పటికీ రాలేదు..అలాంటి 68 ఏళ్ళ వయస్సు లో చిరంజీవి కి వచ్చాయంటే ఆయన స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..అయితే ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 34.00 కోట్లు
సీడెడ్ 17.30 కోట్లు
ఉత్తరాంధ్ర 18.50 కోట్లు
ఈస్ట్ 12.25 కోట్లు
వెస్ట్ 7.23 కోట్లు
నెల్లూరు 4.25 కోట్లు
గుంటూరు 7.18 కోట్లు
కృష్ణ 7.33 కోట్లు
మొత్తం 108.04 కోట్లు
ఓవర్సీస్ 12.64 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.70 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 128.38 కోట్లు

ఈ సినిమా ఫుల్ రన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అలా వైకుంఠ పురంలో’ కలెక్షన్స్ ని దాటేస్తుందని అంచనా వేశారు..కానీ ఇప్పుడు అది కష్టమేమో అనిపిస్తుంది..అలా వైకుంఠపురం లో చిత్రం దాదాపుగా 160 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..’వాల్తేరు వీరయ్య’ చిత్రం ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 135 కోట్ల రూపాయిలను కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు..సోమవారం నుండి ఈ చిత్రం రోజుకు కనీసం 50 లక్షల రూపాయిల షేర్ ని స్టడీ గా నాల్గవ వీకెండ్ వరకు కొనసాగిస్తే ‘అలా వైకుంఠపురం లో’ కలెక్షన్స్ ని దాటి నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది..చూడాలి మరి ఈ చిత్రం ఆ రేంజ్ కి చేరుకుంటుందా లేదా అనేది..ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 90 కోట్ల రూపాయలకు జరిగింది..ఫుల్ రన్ లో 135 కోట్లు రాబట్టగలిగితే 45 కోట్ల రూపాయిలు లాభాలు తెచ్చిన సినిమాగా నిలుస్తుంది.