Mokshagna Teja: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల కొడుకులు నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు కూడా వాళ్లే కావడం విశేషం… బాలయ్య బాబు మాత్రం సీనియర్ హీరోగా తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుంటే అతని కొడుకు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు అనే దానిమీద తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి. గతంలో జనవరి ఒకటోవ తేదీన బాలయ్య బాబు కొడుకు సినిమాను అనౌన్స్ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికి అందులో వాస్తవం లేదనేది అర్థమవుతోంది…
మొత్తానికైతే మోక్షజ్ఞ కి సినిమాల్లో నటించడం ఇంట్రెస్ట్ లేదట. బాలయ్య ఫోర్స్ మేరకే తను సినిమాల్లో నటిస్తానని చెబుతున్నప్పటికి మోక్షజ్ఞ కూడా సుముఖంగా ఉండకపోవడంతో బాలయ్య ఏం చేద్దాం అనే ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. నిజానికి మోక్షజ్ఞ కి బిజినెస్ అంటే చాలా ఇష్టం… తనకు బిజినెస్ స్కిల్స్ కూడా చాలానే ఉన్నాయని తమ సన్నిహితులు సైతం చెబుతూ ఉంటారంట. అలాంటి మోక్షజ్ఞ మీద సినిమా హీరో అవ్వాలని బాలయ్య బాబు ఫోర్స్ తేవడం కరెక్టు కాదు.
నిజానికి ఇండస్ట్రీ లో బాలయ్యకి నట వారసుడు ఉండాలి అనే కోరిక ఉన్నప్పటికి తను బిజినెస్ చేసుకుంటానని చెబుతున్నాడు. కాబట్టి ఇంట్రెస్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చిన కూడా అతను రాణించలేడు. ఒకవేళ సినిమాలు చేసిన కూడా ఒకటి అరా సినిమాలకు మాత్రమే పరిమితం అవుతాడు. అలాగే సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఫేడౌట్ అయిపోతే అదొక పెద్ద అవమానంగా భావించవచ్చు.
కాబట్టి సినిమాలు చేయకుండా ఉంటేనే మంచిది అంటూ బాలయ్య కి తన సన్నిహితులు సైతం బాలయ్య సలహాలు ఇస్తున్నారట… దీని మీద బాలయ్య ఎలా స్పందిస్తాడు. ఇక మోక్షజ్ఞ సినిమా లేనట్టేనా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు…