Shivaji: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో, మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో శివాజీ(Shivaji) హీరోయిన్స్ పై చేసిన వ్యాఖ్యల గురించే డిబేట్స్ నడుస్తున్నాయి. చిన్న టాపిక్ దొరికితేనే వదలని మన న్యూస్ చానెల్స్, సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ రేంజ్ అటెన్షన్ ఇస్తున్న శివాజీ టాపిక్ ని ఎందుకు వదులుతారు చెప్పండి. అయితే సినీ ఇండస్ట్రీ కి చెందిన సెలబ్రిటీలు శివాజీ వ్యాఖ్యలను ముక్తకంఠం తో ఖండిస్తున్నారు. కానీ సామాన్యుల నుండి మాత్రం శివాజీ కి వేరే లెవెల్ సపోర్ట్ వస్తోంది. ఈ రేంజ్ సపోర్ట్ వస్తుందని బహుశా శివాజీ కూడా ఊహించి ఉండదు. యూట్యూబ్ లో లక్షల సంఖ్యలో పోల్ అయ్యే ఓటింగ్స్ లో 90 శాతం మందికి పైగా శివాజీ కి సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు ఆయనకు ఏ రేంజ్ సపోర్ట్ ఉంది అనేది.
ఇకపోతే శివాజీ పై మహిళా సంఘాలు విరుచుకుపడి, మిహిళా కమీషన్ కి పిటీషన్స్ వేయగా, నిన్న ఆయన కమీషన్ ఇచ్చిన ఆదేశాలను గౌరవించి విచారణకు హాజరయ్యాడు. మహిళా కమీషన్ నుండి శివాజీ కి ఎదురైన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇంతకీ మహిళా కమీషన్ అడిగిన ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం. మహిళలు ధరించే దుస్తుల ఆధారంగా, వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనే విషయాన్ని మీరు మర్చిపోయారా? అనేది మొదటి ప్రశ్న అట. మీ కామెంట్స్ మహిళలపై దాడులు పెంచేలా ఉన్నాయని మాకు ఫిర్యాదులు వచ్చాయి, దీనికి మీరేమి వివరణ ఇస్తారు? అనేది రెండవ ప్రశ్న అట. వీటికి శివాజీ తనదైన శైలి లో సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. తానూ చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదట, అందుకు వివరణ మాత్రమే ఇచ్చాడట.
కానీ తన ప్రసంగం లో సామాన్లు, దొంగ ముం**లు అంటూ వాడిన పాదాలకు క్షమాపణలు చెప్తున్నాను అని , ఇప్పటికే బయట కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పానని చెప్పుకొచ్చాడట శివాజీ. ఇంత మంది సినీ సెలబ్రిటీలు వ్యతిరేకిస్తున్నా, మహిళా కమీషన్ కూడా ఇదేమిటి అని ప్రశ్నించినా కాదు, తన అభిప్రాయాన్ని మార్చుకొని శివాజీ ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ మెచ్చుకుంటున్నారు. సాధారణంగా ఈ స్థానం లో ఉన్న వాళ్ళు ఎవరైనా భయపడతారు. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి మహిళా కమీషన్ కి క్షమాపణలు చెప్తారు. కానీ శివాజీ అలా చేయలేదు, తానూ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎలాంటి తప్పు లేదని, వాడిన పదాలు మాత్రమే తప్పని మహిళా కమీషన్ కి కూడా వివరించాడు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.