V V Vinayak Comments: సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ లను సాధిస్తారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా లేకపోయిన టాలెంట్ ఉండి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నవాళ్లు మాత్రమే ఇక్కడ ఎక్కువ రోజులపాటు తమ మనుగడను కొనసాగించగలిగే అవకాశం ఉంటుంది. కొంతమంది దర్శకులకు మంచి టాలెంట్ ఉన్నప్పటికి వాళ్ళు అనుకున్న రేంజ్ లో సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. ఇక అందులో మెహర్ రమేష్ ఒకరు… ఆయన సిన చాలా సినిమాలు అతనికి భారీ డిజాస్టర్ లను కట్టబెట్టాయి. అయితే ఈ విషయం మీద దర్శకుడు వి వి వినాయక్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లైతే చేశాడు. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మెహర్ రమేష్ గురించి మాట్లాడాడు. అతనికి చాలా అద్భుతమైన తెలివి ఉందని కథలను చాలా అద్భుతంగా చెబుతారని దానిని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా చూపించగలిగితే ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పాడు.
ఆయన చెప్పిన కథలేవి పెర్ఫెక్ట్ గా సినిమా గా రాలేదని అందులో కొంతమంది ప్రొడ్యూసర్లు, హీరోలు కథలను మార్చడం సీన్లను చేయించడం వల్ల ఆయనకి సక్సెస్ రావడం లేదు. కానీ ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగితే మాత్రం సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తాయని వివి వినాయక్ మెహర్ రమేష్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.
ఇక మెహర్ రమేష్ సైతం స్టార్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు మీడియం పేజీ హీరోలతో సినిమాలను చేసి సక్సెస్ ని సాధించి తనను తాను ప్రూవ్ చేసుకోవచ్చు కదా! మరి అలాంటి దర్శకుడు ఎందుకని తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. స్టార్ హీరోలు తనకు అవకాశాన్ని ఇవ్వాలంటే ముందు మీడియం రేంజ్ హీరోలను పెట్టి సినిమాలను చేసి సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
అంత టాలెంట్ ఉన్నవాడు ముందు ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపితే సరిపోతుంది కదా అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే ఆయనకి టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఆయన అర్జెంటుగా ఒక మూవీ చేసి సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది…