Vrusha Karma : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) ఈ ఏడాది ‘తండేల్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని, కెరీర్ లోనే తొలి వంద కోట్ల గ్రాస్ సినిమాని అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ కేవలం నాగ చైతన్య కి మాత్రమే కాదు, అక్కినేని ఫ్యామిలీ కి కూడా ఎంతో కీలకమైంది. ఎందుకంటే నాగార్జున, అక్కినేని అఖిల్ కూడా డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నారు. ఇక అఖిల్ అయితే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్క సక్సెస్ ని అందుకోలేకపోతున్నాడని అభిమానుల్లో ఒక రేంజ్ ఫ్రస్ట్రేషన్ ఉన్న సమయంలో విడుదలైన ఈ చిత్రం అక్కినేని ఫ్యాన్స్ కి కొత్త ఊపిరి పోసింది. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ తో కలిసి ఒక మిస్టిక్ థ్రిల్లర్ జానర్ సినిమా చేస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ సినిమాకు ‘వృష కర్మ'(Vrusha Karma) అనే టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రియేటమే సూపర్ స్టార్ మహేష్ బాబు(superstar mahesh babu) చేత ట్విట్టర్ ద్వారా విడుదల చేయించారు మేకర్స్. మీనాక్షి చౌదరి ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ కాస్త విచిత్రం గా ఉంది, ఆడియన్స్ కి రీచ్ అవుతుందా అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. కానీ విరూపాక్ష మూవీ టైటిల్ పెట్టినప్పుడు కూడా చాలా మంది ఇదేమి టైటిల్ అంటూ ప్రశ్నించారు. కానీ సినిమా బాగుండడం తో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం కూడా అలాగే అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అయితే ‘వృష కర్మ’ అంటే ఏంటి? అనేది చాలా మందికి తెలియదు. ఈ టైటిల్ అర్థం ఏంటో తెలుసుకోవడానికి నెటిజెన్స్ గూగుల్ లో తెగ వెతకసాగారు.
‘వృష కర్మ’ అంటే మంచి పని కోసం ఎలాంటి సమస్యలు ఎదురైనా లెక్క చేయకుండా, పట్టుదల తో ముందుకు వెళ్ళేవాడు అని అర్థం. అంతే కాదు శ్రీ మహావిష్ణువు కి హైందవులు పెట్టుకున్న వెయ్యి పేర్లలో వృష కర్మ కూడా ఒకటి అని అంటున్నారు. ‘వృష’ అనగా ధర్మం. ‘కర్మ’ అనగా మనం చేసే పనులు. ఈ టైటిల్ ని బట్టీ చూస్తే ఇది శ్రీ మహావిష్ణువు కి సంబంధించి ఎదో ఒక రహస్యాన్ని వెతికే క్రమం లో హీరోకి ఎదురయ్యే సమస్యలు, ఆయన చేసే సాహసాలే ఈ సినిమా అని అంటున్నారు విశ్లేషకులు. ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ మిస్టరీ జానర్ సినిమాలు రావడం తగ్గిపోయాయి. ఇలాంటి సమయం లో వస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ సరిగా డీల్ చేస్తే కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.
