Viswanadhan Anand: చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బయోపిక్ లు నిర్మించారు. కాగా వాటిల్లో సినిమా ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు, స్వాతంత్ర యోధులు, క్రీడాకారులు, ఆర్మీ సైనికుల బయోపిక్ నిర్మించడం జరిగింది. తెలుగులో ఎన్టీఆర్, సావిత్రి, వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితాలపై బయోపిక్ లు వచ్చాయి. తమిళంలో ఇటీవల జయలలిత జీవితం ఆధారంగా సినిమాను నిర్మించారు. హిందీలోనూ ఇటీవల షేర్ షా, ఉద్దం సింగ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి.

అలానే క్రీడల్లో ప్రతిభ కనపరిచిన పలువురి బయోపిక్ తెరకెక్కించారు. ధోని, సచిన్, సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా ఇప్పటి వరకు సినిమాలు వచ్చాయి. త్వరలో కపిల్ దేవ్ సినిమా కూడా రానుంది. ఆ చిత్రంలో రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో గ్రేట్ పర్సన్ లైఫ్ స్టోరీ తెరకెక్కబోతోంది. ఆయనెవరో కాదు ఇండియాస్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.
ఈ విషయాన్ని స్వయంగా ఆనందే కన్‌ఫర్మ్ చేయడం విశేషం. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీని ప్రస్తావన రావడంతో వివరాలు రివీల్ చేశారు ఆనంద్. ‘నా బయోపిక్ తీయడానికి నేను పర్మిషన్ ఇచ్చాను. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది. కరోనా వల్ల లేటయ్యింది’ అని చెప్పారాయన. మీ పాత్రలో ఎవరు నటిస్తారని అడిగితే ఆమిర్ ఖాన్ అయితే బాగుంటుందని చెప్పారు. ‘నా పాత్ర ఎవరు చేస్తారో నాకైతే ఇంకా తెలీదు. అయితే ఆమిర్ ఒప్పుకుంటాడా అనేదే ఇప్పుడున్న డౌట్. ఆల్రెడీ సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘దంగల్’లో రియల్ లైఫ్ రోల్‌లో అదరగొట్టాడు ఆమిర్. తను నటిస్తే విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ కూడా వేరే లెవెల్‌కి వెళ్తుంది. అయితే ప్రస్తుతం ‘లాల్ సింగ్ ఛద్దా’తో బిజీగా ఉన్నాడు.