Balakrishna Media: టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లకు కరిగిపోయిన బావమరిది బాలయ్య బాబు మీడియా ముందు కొచ్చి సినిమా డైలాగులు పేల్చి ఖబడ్దార్ అంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. మొత్తం నందమూరి ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకొచ్చి మరీ ఇలా వార్నింగ్ ల పరంపర కొనసాగించారు. తన బావ చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడి వైసీపీ నేతల తీరును విమర్శించారు.

చంద్రబాబును, తన సోదరి నారా భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించిన తీరును బాలకృష్ణ ఖండించారు. అయితే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా బాలయ్య బాబు మీడియాను అవమానించారు. బాలకృష్ణ గేటు వద్దకు మీడియా ప్రతినిధులు రాగానే.. టీడీపీ వ్యతిరేకులైన రెండు చానళ్ల ప్రతినిధులను గేటు బయటే ఉంచి మిగిలిన వారిని మాత్రమే లోపలికి అనుమతించారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇటీవల జగన్ పై అసభ్య పదం ఉపయోగించారు. అది పెద్ద దుమారం రేగింది. దానికి గురించి ఖచ్చితంగా వైసీపీ అనుకూల మీడియా చానెల్స్ అడుగుతాయని గ్రహించిన బాలకృష్ణ ఆ చానెళ్లను తన ఇంట్లోకి అనుమతించకపోవడం గమనార్హం. బాలకృష్ణ తన ప్రత్యర్థి మీడియా చానెల్స్ జర్నలిస్టుల ప్రశ్నలకు డిఫెన్స్ లో పడకుండా ఇలా చేసినట్టు తెలిసింది.
ఇక అన్ని చానళ్లను అనుమతించి వైసీపీ అనుకూల చానెళ్లను లోపలికి పిలవకపోవడంతో జర్నలిస్టులు ఆందోళన చేశారు. ఇది మీడియాకు జరిగిన అవమానంగా పేర్కొన్నారు. మీడియా ఛానళ్లు బాలకృష్ణకు జరిగిన అవమానంపై మండిపడ్డాయి. ‘బాలకృష్ణ ప్రెస్ మీట్ కు ఎందుకు పిలిచి మా ముఖంపై గేట్లు మూసేయాలి.. ఇది అవమానకరం’ అని ఓ మీడియా చానెల్ రిపోర్టర్ బాలయ్య తీరుపై నిప్పులు చెరిగారు.
బాలకృష్ణ కుటుంబానికి వారు ఇంతకుముందు చేసిన తప్పులు ఏమిటో తెలుసు కాబట్టే సెలెక్టివ్ గా కేవలం టీడీపీ అనుకూల చానెల్స్ వారినే అనుమతించారని తెలుస్తోంది. అందుకే ఇలా బాలయ్య డిఫెన్స్ లో పడిపోకూడదని ఈ స్కెచ్ గీసినట్టు అర్థమవుతోంది.