Homeఎంటర్టైన్మెంట్Viswambhara 2 Sequel Update: 'విశ్వంభర 2' ఉంటుందా...ముందైతే ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ చెప్పండి...

Viswambhara 2 Sequel Update: ‘విశ్వంభర 2’ ఉంటుందా…ముందైతే ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ చెప్పండి…

Viswambhara 2 Sequel Update: గత 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళుతున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే సత్తా తనకి ఉన్నప్పటికి ఆయన కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవుతున్నాడు. ఇప్పుడు వశిష్ట డైరెక్షన్లో చేసిన విశ్వంభర సినిమా రిలీజ్ కి రెడీ అవుతోందంటూ మేకర్స్ నుంచి చాలా వరకు అనౌన్స్ మెంట్స్ వచ్చిన కూడా అవేవీ కార్యరూపం దాల్చడం లేదు. గత సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికి ఈ సినిమా అనుకున్న రీతిలో రాలేదనే ఉద్దేశ్యంతో ఈ సినిమానైతే ఆపేసారు. ఇక ఇప్పటికైనా ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

ఇక చిరంజీవి సైతం ఈ సినిమా 2026 సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయినప్పటికి ఈ సినిమా ఇంకా ఇప్పటి వరకైతే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. దానికి తోడుగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తిని చూపించడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఇప్పుడు సినిమా యూనిట్ నుంచి విశ్వంభర సినిమాకి సీక్వెల్ గా విశ్వంభర 2 కూడా ఉంటుంది అంటూ అనౌన్స్ చేస్తున్నారు. దాంతో విసిగిపోయిన ప్రేక్షకులు ముందైతే మొదటి పార్ట్ రిలీజ్ చేయండి. ఆ తర్వాత సెకండ్ పార్ట్ గురించి ఆలోచించొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎందుకని ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతలా భయపడుతున్నారు.

ప్రేక్షకులకు నచ్చుతుందా? నచ్చదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసి మరి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు… సినిమా అవుట్ పుట్ బాగా వచ్చినప్పుడు సిజి వర్క్ ఉన్నా కూడా ప్రేక్షకులు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం పూర్తిగా సిజీ మీదనే డిపెండ్ అయినట్టుగా తెలుస్తుంది. కేవలం సీజీ వర్క్ హైలెట్ గా నిలిస్తే చాలు సినిమా సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. కానీ కథలోని ఎమోషన్ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగితే ఎలాంటి సినిమా అయిన సరే సూపర్ సక్సెస్ ను సాధిస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version